ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!

ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో వారివారి అనుచరుల పోటీకి హోరాహోరీ సిఫార్సులు వస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి పట్టు ఉంది. ఈటల రాజేందర్ అనుచరులకు అవకాశం ఇవ్వకుంటే ఆయన BJPకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది.

New Update
Bandi Sanjay Vs Etela Rajender

ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఈటల రాజేందర్ బహిరంగంగానే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఆయనపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలో హుజూరాబాద్‌ బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కొందరిపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు బట్టి చూస్తుంటే సొంత పార్టీ నేలపైనే కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నా కొడకా.. ఈటల మాస్ వార్నింగ్

కరీంనగర్ సెంట్రర్ ఆఫ్ పాలిటిక్స్‌గా ఈటల హాట్ కామెంట్లు చేశారు. పరోక్షంగా బండి సంజయ్‌కు నా కొడ* అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హుజూరాబాద్‌ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. కొందరు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీలో అంతర్గత విభేదాలు ఈ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేసేలా కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రాజాసింగ్.. ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీలో కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారు.

ఎవరి బలం ఎంత..?

కరీంనగర్ నుంచి వరుసగా 2వ సారి ఎంపీగా ఉన్నారు బండి సంజయ్, అటు హుజూరాబాద్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 7ఏళ్లు కరీంనగర్ జిల్లా మంత్రిగా పని చేశారు ఈటల రాజేందర్. చూస్తోంటే వీరిద్దరి మధ్య వార్ స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు బండి సంజయ్‌కు హూజూరాబాద్ నియోజవకర్గంలో తక్కువ ఓట్లు పోలైయ్యాయి. ఆయన గెలుపుకి సహకరించలేదని అప్పటి నుంచే మనసులో విభేదాలకు భీజాలు పడ్డాయి. అలాగే ఈటలకు రావాల్సిన బీజేపీ అధ్యక్ష పదవిని బండి సంజయ్ అడ్డుకున్నారని ఈటల రాజేందర్ పరోక్షంగా కొన్ని సార్లు చెప్పుకొచ్చారు.

స్థానిక ఎన్నికల్లో అనుచరుల కోసం కొట్లాట

మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. దీంతో అందులో పోటీ చేయడానికి ఇప్పటికే వీరిరువురి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. తనకు కావాల్సిన వారికే లోకల్ బాడీ ఎలక్షన్‌లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఇప్పిస్తానని బండి సంజయ్, తనతో పాటు బీజేపీలోకి వచ్చిన అనుచరులకే ZPTC, MPTC అభ్యర్థులుగా బీ ఫామ్ ఇప్పిస్తానని ఈటల రాజేందర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది.

ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఈ వార్ ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తోంది. బండి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వ్యక్తి, ఈటల కొత్తగా బీజేపీలోకి వచ్చినా కార్యకర్తలు, క్యాడర్ ఎక్కువ. గొడవ చాలా దూరం వెళ్తోంది. వీరిలో ఎవరూ దగ్గేవారు కాదు. ఒకవేళ బండి సంజయ్ అనుచరులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన్యత ఇస్తే ఈటల ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడరని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే ఈటల రాజేందర్ బీజేపీకి రాజీనామా చేస్తారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం విషయం అక్కడి దాకా వెళ్లనిస్తోందా.. లేకా వీరి వివాదంలో కలుగజేసుకొని బండి, ఈటల మధ్య గొడవలకు ఫుల్‌స్టాప్ పెడుతుందా చూడాలి మరి..

Advertisment
తాజా కథనాలు