Gandikota Girl: చెల్లెను చంపి.. బట్టలు విప్పి - వినుకొండ కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలిక సోదరులే చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుందనే కోపంతో అన్నలే హత్య చేశారని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. 

New Update

కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. పరువు హత్యగా పోలీసులు తేల్చారు. బాలిక సొంత అన్న బ్రహ్మయ్య, కజిన్ బ్రదర్ కొండయ్యే చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుందనే కోపంతో అన్నలే హత్య చేశారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతి మృతదేహాన్ని మొదట గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించింది కొండయ్యే కావడం గమనార్హం. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

నిందితులను విచారించగా.. సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తామే తమ చెల్లెలిని చంపామని నిందితులిద్దరూ ఒప్పుకున్నట్లు సమాచారం. జులాయిగా తిరుగుతున్న లోకేష్‌తో ప్రేమ వద్దని అన్నలు ఎంత చెప్పినా వినకపోవడంతోనే చెల్లిని దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Gandikota girl murder case 

ఈ కేసు ట్విస్టులతో హత్యా? లేదా పరువు హత్యా? అని తెలుసుకోవడానికి ఎన్నో మలుపులు తిరిగింది. మొదట్లో బాలికను ప్రియుడు లోకేష్‌ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడించారు. అనంతరం సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికను గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్‌.. 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి.. తనను అక్కడే వదిలేసి లోకేష్‌ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

ఆ సమయంలోనే పోలీసులకు యువతి అన్నలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి తల్లి మాత్రం పోలీసుల అనుమానాల్ని తప్పుబట్టింది. తన కూతురిని అన్నలే చంపిఉంటే బట్టల్లేకుండా చేస్తారా?.. రక్తంపట్టుకు పుట్టిన చెల్లెలను ఎవరైనా అలా చేయగలారా? అని మీడియాతో మాట్లాడినపుడు తెలిపారు. అనంతరం పోలీసులు మృతురాలి అన్నల మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా డెడ్‌బాడీ దొరికిన ప్రాంతంలోనే వారి లొకేషన్ లొకేట్ అయింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టినట్లు తెలిస్తోంది.  

Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు