/rtv/media/media_files/2025/07/21/wife-kills-husband-2025-07-21-21-21-37.jpg)
Wife Kills Husband
Wife Kills Husband : అక్రమ సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యల క్రైం స్టోరీలే ఎక్కువగా వింటున్నాము. తాజాగా ముంబైలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది.
ముంబైకి దగ్గర ఉండే ఓ గ్రామానికి చెందిన విజయ్ చవాన్, కోమల్ భార్యభర్తలు. అయితే విజయ్ కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. అయితే విజయ్ కనిపించకుండా పోయి 15 రోజులు అవుతున్నా కోమల్ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన విజయ్ సోదరుడు తన అన్నకోసం వెతకడం ప్రారంభించాడు. అయినా ఆయన జాడ దొరకలేదు. చివరికి అన్న ఇంటికి వచ్చాడు. ఇంట్లో వెతకగా ఆ ఇంటిలో ఓ చోట టైల్స్ రంగు కొంత తేడాగా కనిపించింది. విజయ్ సోదరుడికి అనుమానం వచ్చింది. ఆ టైల్స్‌ను తొలగించి చూడగా విజయ్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. అయితే విజయ్ కోసం ఆయన సోదరుడు వెతుకుతున్నాడని తెలిసి కోమల్ అప్పటికే పారిపోయింది.
విజయ్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కోమల్ కొంత కాలంగా పక్కింట్లో ఉంటున్న మోనూ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరూ కలిసి విజయ్‌ను కరెంట్ షాక్ ఇచ్చి చంపేసి ఇంట్లోనే పాతిపెట్టినట్లు గుర్తించారు. అ తర్వాత పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
భర్త వద్దని ప్రియుడే ముద్దని...
యూపీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన 25 ఏళ్లకు ఆమెకు తన భర్త మీద విరక్తి పుట్టింది. అంతేకాదు బంధువైన 25 ఏళ్ల యువకుడిపై ప్రేమ పుట్టింది. చివరకు ప్రేమ ముదరి పాకాన పడటంతో భర్త, నలుగురు పిల్లలను వదిలిపెట్టి అతడితో వెళ్లిపోయింది. సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనం కలిగించింది. సుమారు 45 ఏండ్ల వయసున్న మహిళకు నలుగురు పిల్లలున్నారు. అయితే భర్త వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడు. ఈ క్రమంలోనే వారింటికి ఆమె బంధువైన ఓ 25 ఏళ్ల యువకుడు వస్తుండేవాడు. అది కాస్తా వారిమధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఆ తరువాత మహిళ అతడిని ఏకంగా వివాహం చేసుకుంది. భర్తను, పిల్లలను వదిలిపెట్టి యువకుడితో వెళ్లిపోయింది.
కాగా, ఈ విషయమై పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. కొంత కాలం తరువాత లవర్‌తో కలిసి తిరిగొచ్చిన మహిళ మళ్లీ భర్తతో కొంతకాలం ఉంది. ఈసారి ఆమె ప్రియుడు ఫిర్యాదు చేశాడు. తమకు పెళ్లైందని, ఆమె తన భార్య అని పేర్కొన్నాడు.తిరిగి అతనితో మరోసారి వెళ్లిపోయిన మహిళ ఆదివారం గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీ పెట్టింది. తను ప్రియుడితోనే ఉంటానని, తమకు పెళ్లి కూడా అయ్యిందని చెప్పింది. దీంతో చేసేది లేక భర్త రాజీ పడ్డాడు. భార్యను యువకుడికే వదిలేశాడు.
ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్