/rtv/media/media_files/2025/07/21/indian-origin-doctor-in-us-charged-with-medical-fraud-2025-07-21-12-21-25.jpg)
Indian-Origin Doctor In US Charged With Medical Fraud
USA: అమెరికాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళా పేషెంట్లకు తప్పుడు డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి.. దీనికి బదులుగా తన కోరిక తీర్చాలని ఓ భారత సంతతి వైద్యుడు వాళ్లని లొబర్చుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు న్యూజెర్సీలోని సెకాకస్‌కు చెందిన డాక్టర్ రితేష్ కల్రా(51)గా గుర్తించారు. అతడు మహిళా పేషెంట్లకు తప్పుడు ప్రిస్ర్కిప్షన్‌లు ఇచ్చి దీనికి ప్రతీగా లైంగిక కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు పేషేంట్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ముంబయి రైలు పేలుళ్ల ఘటన.. అసలు ఆ రోజు ఏం జరిగింది ?
అమెరికా కోర్టులో విచారణ తర్వాత రితేష్‌ను గ-ృహ నిర్బంధంలో ఉంచామని అధికారులు వెల్లడించారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. డా. రితేష్ కల్రా న్యూజెర్సీలోని సెకాకస్‌లో ఫెయిర్ లాన్ క్లినిక్ నడిపిస్తున్నాడు. తన దగ్గరికి వచ్చే మహిళా పేషెంట్లకు అవసరం లేకున్నా కూడా ఆక్సికోడోన్ వంటి శక్తిమంతమైన డ్రగ్స్ ఇచ్చేవాడు. దీనికి బదులుగా వాళ్లను లోబర్చుకొని లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఇలా అతడు 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 31 వేల కంటే ఎక్కువ ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్‌లను పేషెంట్లకు ఇచ్చాడని అధికారులు గుర్తించారు.
Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో బాలికను కాపాడిన వీర వనిత
మెడికల్ లైసెన్స్ సస్పెండ్..
ఈ డ్రగ్‌కి అలవాటైన వారు తరచుగా అతడిని సంప్రదించేవారు. ఇలా అడిక్ట్ అయిన వాళ్లను తన లైంగిక కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడు. చివరికి పలువురు పేషెంట్‌లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో అతడు అసభ్యంగా ప్రవర్తించేవాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. రితేశ్ తన పనులతో చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రితేశ్ కల్రా మెడికల్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు అమెరికా కోర్టు తెలిపింది. అంతేకాదు రితేశ్ తన క్లినిక్‌ను పూర్తిగా మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అతడు దోషిగా తేలితే దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా పడే ఛాన్స్ ఉంటుంది.
Also Read:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!