Lok Sabha - Pahalgam Attack: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చింటాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.

New Update
Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs

Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs

Lok Sabha - Pahalgam Attack: 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions) ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో(Lok Sabha) పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చింటాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ ఎంత చెప్పినా కూడా విపక్ష పార్టీల నేతలు వినలేదు. చివరికి స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.  ఇదిలాఉండగా సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ ఘటనల తర్వాత మొదటిసారి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే విపక్ష పార్టీ ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు సభలో ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Also Read: ముంబయి రైలు పేలుళ్ల ఘటన.. అసలు ఆ రోజు ఏం జరిగింది ?

కానీ విపక్ష ఎంపీలు మాత్రం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్షాలు నిరసన చేస్తుండగానే లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటన చేశారు. దీనిపై విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ బయట మాట్లాడారు. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు రాహుల్‌ సభలో చర్చలు కాకుండా అంతరాయాన్ని కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు