Rape: దారుణం.. యువతిపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం !

కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్‌బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్‌పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బాధిత యువతి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

New Update
Karnataka BJP MLA Prabhu Chauhan's son Prateek Chauhan accused of cheating woman

Karnataka BJP MLA Prabhu Chauhan's son Prateek Chauhan accused of cheating woman

కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్‌బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్‌పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం, మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత యువతి శనివారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్‌బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్‌పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం, మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత యువతి శనివారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబర్‌లో తమకు నిశ్చితార్థం అయ్యిందని.. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి తిరిగామని చెప్పింది. 

Also Read: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి

'' నిశ్చితార్ధానికి ముందే ప్రతీక్‌ చౌహాన్ తనను బెంగళూరులోని రేస్‌కోర్స్‌ దగ్గర్లోని హోటల్‌కు తీసుకొచ్చాడు. అక్కడ మేమిద్దరం ఏకాంతంగా గడిపాం. మహారాష్ట్రలోని ఓ హోటల్‌కు కూడా అతడు తీసుకెళ్లాడు. కానీ అక్కడ నన్ను లైంగికంగా వాడుకున్నాడు. చివరికి గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనంటూ చెప్పేశానని'' బాధిత యువతి ఆరోపించింది. 

మరోవైపు ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ప్రభు చౌహన్ స్పందించారు. ఇదంతా కుట్ర అంటూ ఆరోపించారు. దీని వెనుకు మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉందన్నారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై, తన కొడుకుపై కుట్రతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువతికి ఖూబా అనుచరుల మద్దతుందన్నారు. తన కొడుకుకి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని.. అతను అలాంటి వ్యక్తి కాదని పేర్కొన్నారు. 

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు