/rtv/media/media_files/2025/07/21/bombay-high-court-2025-07-21-10-16-37.jpg)
2006 Mumbai train blasts, Bombay High Court acquits all 12 accused
దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబయిలో రైలు పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనపై 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్లపై అభియోగాలు నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఈ కారణంతోనే నిందితులను నిర్దోషులుగా తేల్చినట్లు స్పష్టం చేసింది. ఈ రైలు పేలుళ్ల దుర్ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత
2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వే లైన్‌లో పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో 189 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది గాయాలపాలయ్యారు.