Typhoon Wipha: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?

చైనా దక్షిణ తీరాన్ని టైఫూన్ విఫా అతలాకుతలం చేసింది. నల్లటి తుఫాను మేఘాలతో వచ్చిన విఫా హైనాన్‌ను తాకి, భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. చీకటి మేఘాలతో కనిపించి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. 

New Update
dark storm clouds bring typhoon wipha to china southern coast

dark storm clouds bring typhoon wipha to china southern coast

దక్షిణ చైనా తీరంలో టైఫూన్ విఫా (Typhoon Wipha) బీభత్సం సృష్టించింది. నల్లటి తుఫాను మేఘాలతో దూసుకొచ్చిన ఈ టైఫూన్.. హైనాన్ ద్వీపం, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదివారం హాంకాంగ్‌ను తాకిన విఫా, సోమవారం ఉదయం చైనా దక్షిణ ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టింది. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Typhoon Wipha

తాజాగా Typhoon Wipha తుఫాను చీకటి మేఘాలతో కనిపించి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. బిల్డింగ్‌లపై నుంచి పైపైకి ఎగిసిపడుతూ అత్యంత భయంకరంగా ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

టైఫూన్ విఫా (Typhoon Wipha) గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీచింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వందలాది ఇళ్లు, భవనాలు ఈ Typhoon Wipha తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

భారీ గాలులు, వర్షాల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. రైళ్లు, ఫెర్రీ సేవలు కూడా నిలిచిపోయాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పాఠశాలలు, కళాశాలలు, అన్ని రకాల వాణిజ్య సంస్థలను మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

హైనాన్ ద్వీపంతో పాటు, గ్వాంగ్డాంగ్, గ్వాంగ్జీ ప్రావిన్స్‌లు కూడా విఫా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. టైఫూన్ విఫా (Typhoon Wipha) ప్రభావంతో చైనా దక్షిణ తీరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు