Himachal Pradesh: షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్‌ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.

New Update
Dhamu train crossing Chakki River collapsed foundation

Dhamu train crossing Chakki River collapsed foundation

హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వందల సంఖ్యలో గాయపడ్డారు, ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఆకస్మిక ఘటనలు ప్రజలను ఎంతగానో ఆందోళన కలిగించాయి. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

తప్పిన పెను ప్రమాదం

ఇది మరువక ముందే ఇప్పుడు మరొక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న రైల్వే వంతెనను దాటుతుండగా ఊహించని దృశ్యం కనిపించింది. అది చూసి అంతా షాకయ్యరు. ఏం చూశారు?.. అందులో అంత భయపడటానికి ఏముంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

హిమాచల్ ప్రదేశ్‌లోని ధాము వద్ద వందలాది మంది ప్రయాణికులతో ఒక రైలు వెళ్తుంది. ఆ రైలు సరిగ్గా చక్కి నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ను దాటుతుండగా.. భారీ వరదల కారణంగా దాని కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పైనున్న ట్రైన్ వంతెనను దాటివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది చూసి చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

latest-telugu-news | train accident news | Himachal Pradesh | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు