🔴Live News Updates: శ్రీశైలం జలాశయంలో షాకింగ్‌ సీన్‌..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

BIG BREAKING : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు మొదటి బిడ్డ కావడం విశేషం. ఈ ఏడాది  ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  

kiara

బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు మొదటి బిడ్డ కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ శుభవార్తతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.   అయితే, ఈ జంట ఇంకా అధికారికంగా ఈ శుభవార్తను ప్రకటించలేదు. ఈ ఏడాది  ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి

కియారాను డెలివరీ కోసం ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దంపతులకు సెలబ్రేటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో  సిద్ధార్థ్, కియారా వివాహం చేసుకున్నారు.  

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

  • Jul 16, 2025 16:57 IST

    శ్రీశైలం జలాశయంలో షాకింగ్‌ సీన్‌..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు

    శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. అయితే చేపల వేట సమయంలో వీరిమధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రాజెక్టులో నీళ్లు విరివిగా ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన్నుకున్నారు.

    Fishermen fighting for fish in Srisailam reservoir



  • Jul 16, 2025 15:53 IST

    తండ్రి వయసు వాడితో ప్రేమ...పురుగులమందు తాగి చివరికి...

    వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ దర్గా సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. వేల్పుగొండస్వామి(42) డీసీఎం డ్రైవర్‌. ఆయనకు వివాహమైంది. ఇక గాయత్రి (22 ) అవివాహితురాలు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.

    Couple suicide



  • Jul 16, 2025 15:52 IST

    హన్మకొండ జిల్లా ముల్కనూరులో మహిళ ఆత్యహత్య...గ్రామంలో ఉద్రిక్తత...

    హన్మకొండ జిల్లా భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Police Station Mulkanoor



  • Jul 16, 2025 14:55 IST

    విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం.. రక్తపు మడుగులో రెండు డెడ్ బాడీలు.. చేసిందెవరు?

    విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి ఓ యువకుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారైన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

     

    Crime
    Crime

     



  • Jul 16, 2025 13:33 IST

    పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

    పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది.

     

    Pakistan PM Shehbaz sharif
    Pakistan PM Shehbaz sharif

     



  • Jul 16, 2025 12:50 IST

    Karnataka Govt : సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

    సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో ఉన్నవి సహా, సినిమా టిక్కెట్లను రూ. 200 కు పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

    karnataka



  • Jul 16, 2025 11:06 IST

    Monsoon Session: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే

    జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పలు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు విపక్షాలు కూడా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

     

    Monsoon session of Parliament to run from July 21 to August 12
    Monsoon session of Parliament to run from July 21 to August 12

     



  • Jul 16, 2025 11:06 IST

    Crime: బస్సులో ప్రసవించి.. కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి

    మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ గర్భిణి కదులుతున్న బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వెంటనే తన భర్తతో కలిసి బస్సు కిటికీలోంచి ఆ పసికందును విసిరేసింది. దీంతో ఆ శిశువు అక్కడిక్కడే మృతి చెందింది.

     

    Woman gives birth on moving bus, throws newborn out of window; baby dies
    Woman gives birth on moving bus, throws newborn out of window; baby dies

     



  • Jul 16, 2025 11:05 IST

    BIG BREAKING: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లలు!

    డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రేటీలతో పాటుగా తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ కుమారుడు రాహుల్‌ తేజ, సైబరాబాద్‌ ఏఆర్‌ డీసీపీ కొడుకు మోహన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

    drugs



  • Jul 16, 2025 11:05 IST

    Jammalamadugu: చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్‌ అప్డేట్!

    వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటలో ఒక యువతి దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని వైష్ణవిగా గుర్తించారు. ఆమె ప్రొద్దుటూరు పట్టణంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది.

    jammalamadugu



  • Jul 16, 2025 10:26 IST

    Baahubali The Epic Run Time: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం‌పై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!

    బాహుబలి: ది ఎపిక్ రీమాస్టర్ వెర్షన్ 2025 అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా 5 గంటల 27 నిమిషాల నిడివి ఉండనుందని వార్తలు వస్తున్నాయి, దీనిపై రానా స్పందిస్తూ "ఫైనల్ రన్‌టైం‌ రాజమౌళికే తెలుసు, ఫైనల్ కట్ తయారయ్యేవరకు ఆయన ఏదీ పంచుకోరు," అని అన్నారు.

     

    Baahubali The Epic Run Time
    Baahubali The Epic Run Time

     



  • Jul 16, 2025 09:41 IST

    Devi Sri Prasad Energy Secret: నా ఎనర్జీకి సీక్రెట్ అదే.. దేవీ శ్రీ ప్రసాద్ ఫిట్‌నెస్ ఫార్ములా తెలిస్తే షాకే..!

    డ్యాన్స్ చేస్తూ పాటలు పాడేందుకు ఎనర్జీతో పాటు కోర్ స్ట్రెంగ్త్, బ్రీత్ కంట్రోల్ కీలకం అంటున్నారు DSP. తాను రోజూ వ్యాయామం చేస్తానని, పెర్ఫార్మెన్స్‌కు ముందు ఆహారం తీసుకోనని, ఫిట్‌నెస్‌నే తన ఎనర్జీకి సీక్రెట్ గా చెబుతున్నారు DSP.

     

    Devi Sri Prasad
    Devi Sri Prasad

     



  • Jul 16, 2025 09:40 IST

    Sperm Count Tips: ఇలా చేయకండిరా బాబు.. ఎప్పటికీ స్మెర్ప్‌ కౌంట్ పెరగదు!

    వేడి నీటి స్నానాలు, హాట్ టబ్‌లను ఎక్కువగా ఉపయోగించడం, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు వాడటం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. పొగ త్రాగడం, అధికంగా మద్యం సేవించడం వీర్య కణాల నాణ్యత, సంఖ్య చలనశీలతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

    sperm



  • Jul 16, 2025 09:40 IST

    Tuvalu: ద్వీప దేశానికి పెద్ద గండం..మరికొన్ని రోజుల్లో కనుమరుగు..భయంతో ప్రజలు

    అదొక అందమైన దేశం. నాలుగు వైపులా నీళ్ళు మధ్యలో భూమి ఉండే బుల్లి ద్వీపం. మూడు వేల ఏళ్ళ నుంచి ఉంటున్న ఈ ద్వీప దేశం మరికొన్నేళ్ళల్లో మాయం అయిపోనుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా పూర్తిగా కనుమరుగు కానుంది. 

     

    Tuvalu
    Tuvalu Nation

     



  • Jul 16, 2025 09:40 IST

    Crime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుర్మార్గులు

    పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బీసీ కాలని సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

     

    Miscreants pour petrol on husband and wife and set them on fire in Palnadu
    Miscreants pour petrol on husband and wife and set them on fire in Palnadu

     



  • Jul 16, 2025 09:02 IST

    Fauja Singh : రోడ్డు ప్ర‌మాదంలో ఫౌజా సింగ్ మృతి.. NRI అరెస్ట్

    పంజాబ్‌లో మారథానర్ ఫౌజా సింగ్ మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో ఒక ఎన్నారై డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్ పిండ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్‌ను ఢీకొట్టిన డ్రైవర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

    f-singh



  • Jul 16, 2025 09:01 IST

    Cyber Crime: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

    సైబర్ నేరగాళ్లు భారత్‌లో ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే రూ.7 వేల కోట్లు ప్రజల నుంచి కాజేసినట్లు కేంద్రం గుర్తించింది. అలాగే మే నుంచి జులై మధ్య సైబర్ కేటుగాళ్లు కొట్టేసిన మొత్తం కలుపుకుంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.

     

    Cyber Crime
    Cyber Crime

     



  • Jul 16, 2025 09:01 IST

    NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్

    రష్యాపై అన్ని రకాలుగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ లు స్తుంటే మరోవైపు నాటో రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. 

     

    mark rutte
    Nato Secretary General Mark Rutte

     



  • Jul 16, 2025 09:01 IST

    Hostel Warden : ఆసలు ఆడదానివేనా నువ్వు .. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి !

    ఇంటిని వదిలి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వార్డెన్ బరితెగించింది.  తాను కూడా ఓ మహిళనే అన్న విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది.  

    warden



  • Jul 16, 2025 07:50 IST

    Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియడం లేదు. నిన్న రష్యాకు తీవ్ర వార్నింగ్ ఇచ్చిన ట్రంప్  ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. జెలెన్ స్కీ మాస్కోను లక్ష్యం చేసుకోకూడదు అన్నారు. 

     

    trump, putin
    trump, putin

     



  • Jul 16, 2025 07:32 IST

    BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా

    ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.

     

    Ukrainian PM Denys Shmyhal resigns
    Ukrainian PM Denys Shmyhal resigns

     



  • Jul 16, 2025 07:32 IST

    BIG BREAKING : మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి  రాజగోపాల్ రాజు (90) తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.

    ravi-teja



  • Jul 16, 2025 07:00 IST

    Spam Messages: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టచ్చు

    మొబైల్ ఫోన్లకు తరచుగా స్పామ్ సందేశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని సులభంగా గుర్తించడం కోసం టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిజమైన మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌ల మధ్య తేడాను ఈజీగా గుర్తించేందుకు ఆ సందేశం చివర్లో ఓ లెటర్‌ను జోడిస్తున్నాయి.

     

    Telcos complete rollout of SMS headers to identify messages, reduce spam
    Telcos complete rollout of SMS headers to identify messages, reduce spam

     



  • Jul 16, 2025 06:59 IST

    Mallavaram : సంతానాన్ని ప్రసాదించే ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు.. మూడు రోజులు ఇలా నిద్ర చేస్తే

    మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలంలోని ఆలవెల్లి మల్లవరం (పాముల మల్లవరం) గ్రామంలో ఉంది. ఈ ఆలయం అనేక విశేషాలకు ప్రసిద్ధి చెందింది.

    mallavaram subramanya swamy temple



  • Jul 16, 2025 06:51 IST

    Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా

    ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదనపు ఆంక్షలను ఫేస్ చేస్తామని తెలిపింది. 

     

    sergev
    Russia’s Foreign Minister Sergei Lavrov

     



Advertisment