/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులు ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరి దగ్గరికి రౌడీ షీటర్ కిషోర్ వెళ్లి వాగ్వాదానికి దిగాడు. గొడవ తీవ్రంగా ముదరడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ కిషోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హత్యకు గురైన వారిలో ఒకరు విజయనగరానికి చెందిన వారు కాగా, మరొకరు విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
కూతురిని దారుణంగా..
ఇదిలా ఉండగా ఇటీవల ముంబైలో నాలుగేళ్ల కూతురిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంబైకి చెందిన నాజియా అనే మహిళకు ఇమ్రాన్‌షేక్‌తో పెళ్లి జరిగింది. అయితే ఈమె కూతురు ఒక్కసారిగా కనిపించడం మానేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సవతి తండ్రి దగ్గర గుర్తించారు.
ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
ఆ నాలుగేళ్ల చిన్నారి సవతి తండ్రి దగ్గర తెల్లవారు జామున 3 గంటల వరకు పడుకోకుండా మొబైల్ చూస్తోంది. చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన తండ్రి ఆ నాలుగేళ్ల చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సముద్రంలో పడేశాడు. చిన్నారిని హత్య చేసిన తర్వాత సవతి తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు.
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
పరారీలో ఉన్నాడని తేలడంతో వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
latest-telugu-news | latest telugu news updates | Andhra Pradesh | vijaywada