NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్

రష్యాపై అన్ని రకాలుగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ లు స్తుంటే మరోవైపు నాటో రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. 

New Update
mark rutte

Nato Secretary General Mark Rutte

బ్రెజిల్, చైనా, భారత్ లు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ కు కొత్త ఆయుధాలు ఇస్తామని ప్రకటించడంతో పాూ రష్యాకు వారి నుంచి వస్తువులు కొనుగోలు చేసే వారిపై అధిక సుంకాలు వసూలు చేస్తామిహెచ్చరించారు. ఈరోజు నాటో కూడా అదే వార్నింగ్ ఇచ్చింది. చైనా, భారత్, బ్రెజిల్ దేశాధినేతలు రష్యాతో వ్యాపారం చేస్తే వారి దగ్గర నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని చెప్పారు. మాస్కో శాంతి చర్చలకు ముందుకు రాకపోతే ఆ దేశంతో పాటూ వారితో వ్యాణిజ్యం చేసేవారికి కూడా 100 శాతం సుకాలు విధిస్తామని హెచ్చరించారు. అలా జరగకుండా ఉండాలంటే పుతిన్ ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయాలని చెప్పారు. ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోతే రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తామని చెప్పారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ మాట్లాడుతూ అల్టిమేటంలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. 

అత్యధిక కొనుగోలుదారులలో భారత్..

ప్రస్తుతం చైనా, భారత్, టర్కీలు రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ కనుక అన్నట్టు ఆంక్షలు విధిస్తే ఈ మూడు దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయిల్ ధరలు అస్థిరంగా ఉన్నాయి. రష్యాపై కూడా ఆంక్షలు మొదలైతే ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దాంతో పాటూ రేట్లు కూడా దారుణంగా పెరిగిపోతాయి. 

Also Read: Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్

Advertisment
Advertisment
తాజా కథనాలు