/rtv/media/media_files/2025/07/16/police-station-mulkanoor-2025-07-16-15-43-45.jpg)
Police Station Mulkanoor
హన్మకొండ జిల్లాలోని భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. 15 ఏళ్లక్రితం దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ వద్ద ముల్కనూరుకు చెందిన రమేష్ అప్పు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగిచ్చేయాలని చంద్రశేఖర్ ఒత్తిడి పెంచాడు. అయితే రమేష్ వినకపోవడంతో ముల్కనూరులో పంచాయతీపెట్టారు. ఈ పంచాయతీలో ఈ నెల 5న రమేష్ చంద్రశేఖర్ కి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ, రమేష్ ఇచ్చిన మాట తప్పాడు. దీంతో రమేష్ ఇంటికి చంద్రశేఖర్ వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను తీసుకున్న డబ్బులు రమేష్ తిరిగి ఇవ్వకపోగా చంద్రశేఖర్ పై ముల్కనూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. దీంతో చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తన భర్త పై కేసు పెట్టడాన్ని చంద్రశేఖర్ భార్య తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
Woman Commits Suicide
వివరాల ప్రకారం... జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారని డబ్బులు ఇచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి బాధిత కుటుంబం స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళా ఆరోపించింది. న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారణ చేపట్టారు. మూడు రోజులుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగారు బాధిత కుటుంబసభ్యులు. అప్పు ఇప్పించాల్సిన పోలీసులే తిరిగి బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని ముల్కనూరు ఎస్సైపై ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చదవండి:డయాబెటిక్ రోగి ఉదయం ఏం తినాలో తెలుసా..? రక్తంలో చక్కెర నియంత్రణ కోసం..
పోలీసులు బెదిరింపులకు పాల్పడటం, ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు... రమేష్ ఇంటి ఎదుట గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే బాధితురాలి బంధువులు నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి
Also Read : ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ
commited-suicide | attempted-suicide | suicide | hanumakonda-district | hanumakonda crime | hanumakonda incident