/rtv/media/media_files/2025/07/14/shubhanshu-shukla-2025-07-14-13-44-43.jpg)
ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులపాటు విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా జూలై 14న భూమికి తిరిగి రానున్నారు. ఈ మిషన్ కేవలం శాస్త్రీయ ప్రయోగాలకే పరిమితం కాకుండా, భారత్ సంస్కృతి, వారసత్వాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు ఒక అద్భుత వేదికగా నిలిచింది. శుక్లా ISS నుంచి కొన్ని వస్తువులను తీసుకువస్తున్నారు. వాటి గురించి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Shubhanshu Shukla: वापसी से पहले शुभांशु ने दोहराए Rakesh Sharma के शब्द | ISS | Axiom-4 Return
— Amar Ujala (@AmarUjalaNews) July 14, 2025
अन्य खबर के लिए दिए गए लिंक पर क्लिक करें : https://t.co/gOi2dG0XwK#shubhanshushukla#iss#isro#spacex#axiom4#amarujalanews@isropic.twitter.com/kXEX0iUjM0
ISS నుంచి శుభాంశు శుక్లా తీసుకువస్తున్నవి:
ఆక్సియమ్ స్పేస్ ప్రకారం, ఆక్సియమ్ మిషన్ 4 బృందం 580 పౌండ్లకు పైగా (సుమారు 263 కిలోగ్రాములు) వస్తువులను తిరిగి తీసుకువస్తున్నారు. వీటిలో ప్రధానంగా 60కి పైగా ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, పరిశోధనా నమూనాలు ఉన్నాయి. శుభాంశు శుక్లా స్వయంగా నిర్వహించిన భారతీయ ప్రయోగాల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి అనేక అరుదైన, ముఖ్యమైన శాస్త్రీయ పదార్థాలతో తిరిగి వస్తున్నారని నాసా తెలియజేసింది. వీటిలో నాసా అంతరిక్ష హార్డ్‌వేర్, 60కి పైగా సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన డేటా ఉన్నాయి. ఈ ప్రయోగాలు అంతరిక్షంలో నిర్వహించబడ్డాయి. భవిష్యత్ అంతరిక్ష సాంకేతికత, వైద్య శాస్త్రానికి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.
తిరుగు ప్రయాణం వివరాలు:
భారతీయ కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు (IST) స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ISS నుంచి అన్‌డాక్ అయింది. శుక్లా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపులతో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. సుమారు 22.5 గంటల ప్రయాణం తర్వాత, ఈ అంతరిక్ష నౌక జులై 15 మధ్యాహ్నం 3 గంటలకు (IST) అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ తిరుగు ప్రయాణం పూర్తిగా ఆటోమేటెడ్‌గా జరుగుతుంది.