BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.

New Update
BRS Ex MLA Gadari Kishore

కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తిరుమలగిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు రేవంత్. అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్ తుంగతుర్తికి ఎందుకు వస్తున్నాడో చెప్పాలంటూ స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి ప్రశ్నించారు.

ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇక్కడికి వచ్చే హక్కు రేవంత్ కు లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు కాళేశ్వరం జలాలు ఇచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టాలన్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రంగా రియాక్ట్ కావడంతో స్థానికంగా హై టెన్షన్ నెలకొంది.

భారీగా అరెస్ట్ లు..

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నేతలను సైతం అరెస్ట్ చేసి సూర్యాపేటకు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు