/rtv/media/media_files/2025/07/16/woman-gives-birth-on-moving-bus-2025-07-16-09-45-09.jpg)
Woman gives birth on moving bus, throws newborn out of window; baby dies
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ గర్భిణి కదులుతున్న బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వెంటనే తన భర్తతో కలిసి బస్సు కిటికీలోంచి ఆ పసికందును విసిరేసింది. దీంతో ఆ శిశువు అక్కడిక్కడే మృతి చెందింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పర్బాణీ జిల్లాలో మంగళవారం నిండు గర్భిణి అయిన రితికా ధేరే (19), తన భర్త అల్తాఫ్ షేక్‌తో కలిసి పుణె నుంచి పర్బాణీకి ఓ స్లీపర్ కోచ్ బస్సులో వెళ్తోంది.
Also Read: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు
ఉదయం 6.30 గంటలకు ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. చివరికి ఆమె బస్సులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వాళ్లు ఆ శిశువును ఓ వస్త్రంలో చుట్టి బస్సు కిటికి నుంచి బయటకు విసిరారు. ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే కిటీలోంచి ఏదో విసేరినట్లు శబ్దం వచ్చిందని బస్సు డ్రైవర్ అల్తాఫ్‌ను అడిగాడు. కానీ అతడు వేరే సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.
Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఇక చివరికీ రోడ్డుపై నిర్జీవంగా పడిఉన్న ఆ పసికందును స్థానికులు చూశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. అలాగే ఆ బస్సును కూడా అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణికులను విచారించిన తర్వాత రితికా, అల్తాఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బిడ్డను పెంచే స్థోమత తమకు లేదని.. అందుకే వదిలేద్దామనుకున్నామని విచారణలో పోలీసులకు చెప్పారు. అలాగే పర్బాణీకి చెందిన ఈ దంపతులు గత 18 నెలలుగా వీళ్లు పుణెలో ఉంటున్నట్లు తెలిపారు. అయితే రితికాను వైద్య సంరక్షణ కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.