Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా

ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదనపు ఆంక్షలను ఫేస్ చేస్తామని తెలిపింది. 

New Update
sergev

Russia’s Foreign Minister Sergei Lavrov

రష్యాపై ఇప్పటికే పెద్దఎత్తున ఆంక్షలు అమలులో ఉన్నాయి. వాటిని మేం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. కొత్త వాటిని కూడా ఫేస్ చేయగలమని అన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లోవ్రోవ్. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించేందుకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారీఫ్ లను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన దాన్ని ఆయన కొట్టిపారేశారు. చైనాలో షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల విదేశాంగశాఖ మంత్రులు సమావేశం తర్వాత సెర్గెయ్ మాట్లాడారు. యుద్ధం ముగింపుకు ట్రంప్ 50 రోజులు గడువు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలని ఉందని అన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి గడువులు బోలెడు మాకిచ్చారని...కానీ ఎవరూ ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు. 

పుతిన్ పై మండిపాటు..

పుతిన్ మొండివైఖరిపై ట్రంప్ నిన్న అసహనం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నీ విన్నట్టే కనిపిస్తారు. చక్కగా మాట్లాడతారు. కానీ వెంటనే రాత్రి పూట బాంబులు వేసి భీభత్సం సృష్టిస్తారు అంటూ ట్రప వ్యాఖ్యలు చేశారు.  ఓవల్‌ ఆఫీస్‌లో నాటో  సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టేతో సమావేశమైన సందర్భంగా ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. పైగా తాను ఈ మధ్య చాలాసార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించానని..బాగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రష్యా పై ఎలాంటి సుంకాలు విధిస్తారు అనే దానిపై మాత్రం ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. 

Also Read: Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ

Advertisment
తాజా కథనాలు