Baahubali The Epic Run Time: బాహుబలి ప్రభాస్(Prabhas) అభిమానులకు ఇది ఓ సూపర్ గుడ్ న్యూస్! ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) సృష్టించిన బాహుబలి సిరీస్‌ను కలిపి రీమాస్టర్ చేసిన స్పెషల్ వెర్షన్ - బాహుబలి: ది ఎపిక్(Baahubali The Epic) - 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలకానుంది. ఈసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు జపనీస్ భాషలో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ అనౌన్స్మెంటే అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతుంటే, మరోవైపు సినిమా రన్‌టైం పై వస్తున్న రూమర్లు చర్చకు కేంద్రంగా మారాయి. ఈ సినిమా నిడివి 5 గంటల 27 నిమిషాలు ఉంటుందన్న ప్రచారం BookMyShow ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందిస్తూ, "ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసినంత టైం ఉంటుంది, ఇదొక ఆసక్తికర ప్రయాణం," అంటూ కామెంట్ చేస్తూ సినిమా పై అంచనాలను పెంచేశారు. కానీ ఇప్పటివరకు చిత్రబృందం ఈ రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
"రాజమౌళి సార్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు!" - రానా(Rana)
ఈ రూమర్లపై రానా దగ్గుబాటి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా ప్రీమియర్ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నాకు కూడా రన్‌టైమ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఒక్క రాజమౌళి గారికే క్లారిటీ ఉంటుంది. ఆయన ఫైనల్ కట్ తయారయ్యేవరకు ఏదీ పంచుకోరు," అని రానా చెప్పారు. రానా వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు అందరి చూపు రాజమౌళి నుండి వచ్చే అధికారిక అప్డేట్ మీదే ఉంది.
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
అభిమానుల కోసం కొత్త Reddit కమ్యూనిటీ..
ఇక అభిమానుల కోసం చిత్రబృందం కొత్తగా r/worldofbaahubali అనే రెడిట్ కమ్యూనిటీని ప్రారంభించింది. ఇక్కడ ఫ్యాన్స్ తమ ఆర్ట్‌వర్క్‌లు షేర్ చేయొచ్చు, అధికారిక అప్డేట్స్ ఫాలో కావచ్చు.
పదేళ్ల తరువాతా బాహుబలి మ్యాజిక్..
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్లతో తెరకెక్కిన బాహుబలి, తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చూపించిన ప్రాజెక్ట్. ఇది పాన్-ఇండియా సినిమాల ట్రెండ్‌కు బీజం వేసింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత కూడా ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ కొత్త రికార్డుల కోసం సిద్ధమవుతోంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Baahubali The Epic Run Time: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైంపై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!
బాహుబలి: ది ఎపిక్ రీమాస్టర్ వెర్షన్ 2025 అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా 5 గంటల 27 నిమిషాల నిడివి ఉండనుందని వార్తలు వస్తున్నాయి, దీనిపై రానా స్పందిస్తూ "ఫైనల్ రన్‌టైం రాజమౌళికే తెలుసు, ఫైనల్ కట్ తయారయ్యేవరకు ఆయన ఏదీ పంచుకోరు," అని అన్నారు.
Baahubali The Epic Run Time
Baahubali The Epic Run Time: బాహుబలి ప్రభాస్(Prabhas) అభిమానులకు ఇది ఓ సూపర్ గుడ్ న్యూస్! ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) సృష్టించిన బాహుబలి సిరీస్‌ను కలిపి రీమాస్టర్ చేసిన స్పెషల్ వెర్షన్ - బాహుబలి: ది ఎపిక్(Baahubali The Epic) - 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలకానుంది. ఈసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు జపనీస్ భాషలో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ అనౌన్స్మెంటే అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతుంటే, మరోవైపు సినిమా రన్‌టైం పై వస్తున్న రూమర్లు చర్చకు కేంద్రంగా మారాయి. ఈ సినిమా నిడివి 5 గంటల 27 నిమిషాలు ఉంటుందన్న ప్రచారం BookMyShow ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందిస్తూ, "ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసినంత టైం ఉంటుంది, ఇదొక ఆసక్తికర ప్రయాణం," అంటూ కామెంట్ చేస్తూ సినిమా పై అంచనాలను పెంచేశారు. కానీ ఇప్పటివరకు చిత్రబృందం ఈ రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
"రాజమౌళి సార్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు!" - రానా(Rana)
ఈ రూమర్లపై రానా దగ్గుబాటి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా ప్రీమియర్ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నాకు కూడా రన్‌టైమ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఒక్క రాజమౌళి గారికే క్లారిటీ ఉంటుంది. ఆయన ఫైనల్ కట్ తయారయ్యేవరకు ఏదీ పంచుకోరు," అని రానా చెప్పారు. రానా వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు అందరి చూపు రాజమౌళి నుండి వచ్చే అధికారిక అప్డేట్ మీదే ఉంది.
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
అభిమానుల కోసం కొత్త Reddit కమ్యూనిటీ..
ఇక అభిమానుల కోసం చిత్రబృందం కొత్తగా r/worldofbaahubali అనే రెడిట్ కమ్యూనిటీని ప్రారంభించింది. ఇక్కడ ఫ్యాన్స్ తమ ఆర్ట్‌వర్క్‌లు షేర్ చేయొచ్చు, అధికారిక అప్డేట్స్ ఫాలో కావచ్చు.
Also Read: మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం
పదేళ్ల తరువాతా బాహుబలి మ్యాజిక్..
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్లతో తెరకెక్కిన బాహుబలి, తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చూపించిన ప్రాజెక్ట్. ఇది పాన్-ఇండియా సినిమాల ట్రెండ్‌కు బీజం వేసింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత కూడా ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ కొత్త రికార్డుల కోసం సిద్ధమవుతోంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read: ఓర్నీ.. లవర్ ఫోన్ మాట్లాడలేదని సూసైడ్ చేసుకున్నాడు!