/rtv/media/media_files/2025/07/16/couple-suicide-2025-07-16-15-14-36.jpg)
Couple suicide
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన వేల్పుగొంగస్వామి(42) డీసీఎం డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు వివాహమైంది. ఇక వరంగల్ జిల్లా ఏనుమాముల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2కు చెందిన గాయత్రి (22 ) అవివాహితురాలు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. కాగా వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అదే రోజు స్వామి, మరునాడు ఉదయం గాయత్రి చనిపోయారు. అయితే వీరి మరణంపై సంచలన విషయాలు వెలుగు చూశాయి.
డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న వేల్పుగొండ స్వామి ఇందిరమ్మ కాలనీలోనే తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. స్వామికి ఇరవై ఏండ్ల క్రితం పెండ్లికాగా ఇద్దరు పిల్లులన్నారు. స్వామి ఇంటి ఎదురుగానే గాయత్రి ఇల్లు ఉండటంతో ఇద్దరిమధ్య పరిచయం ఏర్పడింది. గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపేసింది. తరుచుగా స్వామి ఇంటికి వెళ్లే క్రమంలో గాయత్రిని స్వామి లోబరుచుకుని ప్రేమాయణం నడిపాడు. గాయత్రి తండ్రి కుమారస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తూ తమ కులవృత్తి రజక ల్యాండ్రీని నిర్వహిస్తున్నారు. భార్య ఇళ్లల్లో దుస్తులు ఉతుకుతూ చేదోడుగా ఉంటున్నారు. గాయత్రి సైతం తన తండ్రి వయసు ఉన్న స్వామిని నమ్మింది. అతను లేకపోతే జీవించలేనన్న స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో విషయం గాయత్రి ఇంటిలో తెలిసింది.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
ఈ విషయం తెలిసిన తర్వాత ఆరునెలల కిందట పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కాలనీ పెద్దలు స్వామిని మందలించి మరోసారి గాయత్రితో చనువుగా ఉంటే కాలనీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. తర్వాత స్వామి కుటుంబంతో సహా హనుమకొండకు మకాం మార్చాడు. అయినా, గాయత్రి స్వామి మధ్య సంబంధం కొన సాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గాయత్రి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని భావిస్తున్న తరుణంలో ఈనెల 2న ఇంట్లోంచి 10 తులాల బంగారం, నగదు తీసుకుని గాయత్రి పారిపోయింది. స్వామిమీద అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఎనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను స్వామి ఈ నెల 2వ తేదీన ఎంజీఎం హాస్పిటల్‌కి తీసుకొచ్చి చేర్చాడు. అనంతరం మళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. స్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో, నాలుగో తేదీన స్వామి సోదరుడు వేల్పుగొండ యాకయ్య మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంట్లోంచి వెళ్లాక విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలలో స్వామి, గాయత్రి గడిపారు. అనంతరం వేములవాడకు చేరుకున్న వారిద్దరూ అక్కడే పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే తమ పెళ్లిని ఎవరూ అంగీకరించరన్న భయంతో అక్కడే ఆత్మహత్య చేసుకుందామని భావించినా ఇల్లు అద్దెకు దొరకకపోవడంతో అన్నారం షరీష్‌కు వచ్చినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి:డయాబెటిక్ రోగి ఉదయం ఏం తినాలో తెలుసా..? రక్తంలో చక్కెర నియంత్రణ కోసం..
పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకున్న ఇద్దరు స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున గడ్డిమందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి స్వామి మృతిచెందగా.. సోమవారం ఉదయం గాయత్రి చనిపోయారు. అర్ధరాత్రి 2.15 గంటలకు అన్నారం షరీఫ్‌లో గది అద్దెకు ఇచ్చిన యజమాని కుమారస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన హుటాహుటినా ఎంజీఎం కు వెళ్లారు.
బతికించు నాన్నా...
కాగా, గడ్డిమందు తాగి ఎంజీఎంకు చేరుకున్న గాయత్రి తన తండ్రిని చూసి బోరున విలపించింది. నాన్నా.. నాకు చనిపోవాలని లేదు.. నాన్నా.. నాన్న నన్ను బతికించు.. నేను చచ్చిపోను.. నాన్న నాన్న నాన్న అంటూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గాయత్రి చేసిన చివరి ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తండ్రిని చూసిన గాయత్రి నాన్నా... నన్ను బతికించూ అంటూ వేడుకోవడం ఆడపిల్లల తల్లిదండ్రుల నిస్సహాయతకు అద్దం పట్టింది.
తెలిసి తెలియని వయసులో తండ్రి వయసువాడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడిన గాయత్రి విషయం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెళ్లీడుకొచ్చిన బిడ్డ తల్లిదండ్రుల కళ్లేదుటే మరణించడంతో వారికి పుట్టెడు దుంఖం తప్ప మరేం మిగలలేదు. భార్య పిల్లలు ఉండగానే కూతురు వయసు యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది.
ఇది కూడా చదవండి: కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి
Also Read : తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు
hanmakonda-district | hanmakonda | mgm-hospiatal | mgm-hospital | love-story | suicide | crime news | driver | warangal