/rtv/media/media_files/2025/07/16/sperm-2025-07-16-09-28-49.jpg)
సంతాన సమస్యలు (Infertility) అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దంపతులు ఎదుర్కొంటున్న సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సుమారు 15% జంటలు సంతానలేమితో బాధపడుతున్నారు. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ సమస్యల వల్ల కలగవచ్చు. అయితే పురుషులలో సంతానలేమికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. స్పెర్మ్ కణాలు(Sperm Cells) అండం వైపు కదలలేకపోవడం, అసాధారణ ఆకృతి గల స్పెర్మ్ కణాలు, అసలు శుక్రకణాలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఎపిడిడిమైటిస్ లేదా ఆర్కిటిస్ వంటివి వీర్య కణాల ఉత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. అధిక వేడిలో పనిచేయడం, వేడి నీటి స్నానాలు, హాట్ టబ్‌లను ఎక్కువగా ఉపయోగించడం, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు వాడటం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. పొగ త్రాగడం, అధికంగా మద్యం సేవించడం వీర్య కణాల నాణ్యత, సంఖ్య చలనశీలతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఊబకాయం (Obesity) హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి, వీర్య కణాల సంఖ్యను తగ్గించవచ్చు. విటమిన్లు (విటమిన్ సి, డి), జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం వీర్య కణాల ఆరోగ్యానికి అవరోధంగా మారవచ్చు. బిగుతుగా ఉండే లోదుస్తులు వృషణాల వద్ద వేడిని పెంచి, వీర్య కణాల ఉత్పత్తిని ప్రభావితం చేయగలవు. వృషణాల వేడికి గురికాకుండా చూసుకోవాలి.
పెరగాలంటే ఏం చేయాలి
అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా స్మెర్ప్ కౌంట్ పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయమం చేయాలి. రోజూ పొద్దున టిఫిన్ చేయడం కంటే బదులుగా మొలకెత్తిన విత్తనాలు (Sprouts) తినండి. జీవమున్న మొలకలు బతుకున్న సెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. ఆ తరువాత ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఏదైనా ఓ పండు లేదా కూరగాయ జ్యూస్ ను తాగండి. మళ్లీ మధ్యాహ్నం అన్నం తినేయండి. రాత్రికి అన్నం బదులుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు పెట్టుకుని తినండి. వీటితో పాటుగా పండ్లను తినండి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి బాగా సహయపడుతోంది. ఇలా ఓ మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే స్పెర్మ్ కౌంట్ లో తేడాలను గమనించవచ్చు. స్పెర్మ్ కౌంట్ రిఫ్రెష్ కు 70 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. డాక్టర్లు వద్దకు వెళ్లకుండానే స్పెర్మ్ కౌంట్ పెరుగుదలను గమనించవచ్చు.