Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియడం లేదు. నిన్న రష్యాకు తీవ్ర వార్నింగ్ ఇచ్చిన ట్రంప్  ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. జెలెన్ స్కీ మాస్కోను లక్ష్యం చేసుకోకూడదు అన్నారు. 

New Update
trump

putin, zelensky, Trump

ఉక్రెయిన్ తో 50 రోజుల్లో యుద్ధం ముగించాలని లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని నిన్న రష్యాకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ఈరోజు మళ్ళీ మాట మార్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాస్కోను లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు. పైగా తాను ఎవరి పక్షాన లేనని..మానవత్వం పక్షాన ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను కేవలం హత్యలను ఆపాలని మాత్రమే అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల మాత్రం ఆయన మళ్ళీ నిరాశనే వ్యక్తం చేశారు. రీసెంట్ గా తాను అనేక వివాదాలను పరిష్కరించానని..కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు. ఇది ట్రంప్ యుద్ధం కాదని..బైడెన్ యుద్ధమని చెప్పుకొచ్చారు. 

యుద్ధానికి సహకరిస్తామని..

అంతకు ముందు యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయంగా ఉంటామని మళ్ళీ హామీ ఇచ్చారు. అత్యాధునిక ఆయుధాలను నాటోకుే అందజేస్తామని.. అది ఉక్రెయిన్ తో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. నాటోకు పంపే ఆయుధాలలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలు ఉంటాయని కూడా తెలిపారు. ఉక్రెయిన్‌, రష్యాలకు ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ కీథ్‌ కెలాగ్‌  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. 

Also Read: Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా

Advertisment
Advertisment
తాజా కథనాలు