Karnataka Govt : సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో ఉన్నవి సహా, సినిమా టిక్కెట్లను రూ. 200 కు పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

New Update
karnataka

సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో ఉన్నవి సహా, సినిమా టిక్కెట్లను రూ. 200 కు పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కన్నడ సినిమాలతో పాటుగా అన్ని భాషా చిత్రాలు, అన్ని థియేటర్లలో ప్రతి షో టికెట్ ధర వినోద పన్నుతో సహా రూ. 200 మించరాదని నోటిఫికేషన్ లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, బాల్కనీ, ప్రీమియం వంటి సీటు విభాగాల మధ్య ధరల వ్యత్యాసం ఉండదు. అన్ని సీట్లకు ఒకే ధర వర్తిస్తుంది.

ప్రభుత్వం 15 రోజుల గడువు

ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే తెలియజేయడానికి ప్రభుత్వం 15 రోజుల గడువు ఇచ్చింది.  ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది.ఈ నిర్ణయం వల్ల సినిమా చూడటం సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, కన్నడ సినిమా పరిశ్రమకు మేలు జరుగుతుందని అక్కడి చలనచిత్ర వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే, ఈ ధరల పరిమితి వల్ల తమ ఆదాయం భారీగా తగ్గుతుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, హోం శాఖ, విధాన సౌధ, బెంగళూరు-560 001 కు పంపవచ్చు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో సినిమా టిక్కెట్ల ధరలకు పరిమితి విధిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు