/rtv/media/media_files/2025/07/16/first-night-pregnancy-test-2025-07-16-18-27-23.jpg)
First night Pregnancy Test
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ పెళ్లి కొత్త వివాదానికి దారితీసింది. జూలై 12న జరిగిన ఓ పెళ్లి సంబరాలు ఇలా ఘర్షణకు దారితీస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. పెళ్లి అనంతరం వధువు వరుడి ఇంటికి వెళ్లింది. కానీ కొత్త వాతావరణం, అలసటతోపాటు వేడి కారణంగా వధువు అస్వస్థతకు గురైంది. ఆమె తల తిరుగుతున్నట్లు చెప్పడంతో వరుడు ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. అయితే స్నేహితులు నవ్వుతూ ఇదేమైనా గర్భధారణ లక్షణాలేమో? అని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ మాటలు వినగానే వరుడు అనుమానంతో కలతకు గురయ్యాడు. వెంటనే అతడు సమీపంలోని మెడికల్ షాప్‌కి వెళ్లి ఒక గర్భధారణ పరీక్ష కిట్‌ను తీసుకొచ్చాడు. అదే రాత్రి వధువుకు ఇచ్చి పరీక్ష చేయాలని కోరాడు.
Also Read : తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
పెళ్లి రాత్రి ప్రెగ్నెన్సీ టెస్ట్..
అయితే వరుడి తీరుపై వధువు తీవ్రంగా ఆగ్రహించింది. ఇది తనను అవమానపరచడం లాంటిదని భావించి వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కొద్దిసేపటిలోనే వధువు బంధువులు వరుడి ఇంటికి చేరుకున్నారు. అంతే రెండు కుటుంబాల మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు గంటలపాటు పెద్ద గొడవ జరిగింది. చివరకు గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని రెండు కుటుంబాలను ఒకే చోట కూర్చోబెట్టారు. విషయం మొత్తం తెలుసుకుని పంచాయతీ పెట్టారు.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది
పెద్దల సమక్షంలో వరుడు జరిగిన దానికి కారణం వివరించాడు. తనకు అనుమానం వచ్చింది కానీ ఇలాంటి తీరు తప్పు అని అంగీకరించాడు. ఇకపై ఇటువంటి వ్యవహారాల్లో సంయమనం పాటిస్తానని.. మరోసారి ఇలాంటి తప్పు చేయనని హామీ ఇచ్చాడు. వధువు కుటుంబాన్ని శాంతింపజేశాడు. చివరకు గ్రామస్థులు, పెద్దల చొరవతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా పెళ్లయిన జంట మధ్య ఇలా అనుమానాలు పెరగడం, ఆపై పెద్దల జోక్యంతో సమస్యలు పరిష్కరించుకోవడం గ్రామ ప్రజల్లో చర్చకు దారితీసింది.
ఇది కూడా చదవండి: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!
Also Read : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
(viral-news | up | pregnancy-test)