TG Holiday: తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?

తెలంగాణలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు జూలై 23న ఉద్యమం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

New Update
Telangana

Telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీన నరాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్ పోస్టర్‌ను హిమాయత్‌నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించి వారి సమస్యను తెలియజేశారు.

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారని..

తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు డిమాండ్లు కూడా సమర్పించాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్య సంస్థలు ఇష్టానుసారం ఫీజులు పెంచుతున్నారు. దీనివల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఈ దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచర్, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటివల్ల బోధన దెబ్బతింటుంది.

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఈ ఉద్యమానికి రెడీ అవుతున్నారు. వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్‌లో కూడా ఉండాలని కోరారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలని తెలిపారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌లు లేకపోవడం వల్ల ఎందరో పేద విద్యార్థులు వారి చదువులను మధ్యలోనే ఆపేశారని అంటున్నారు. 

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

చాలా పాఠశాలలు, కళాశాలల్లో సరైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మరుగు దొడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. వీరికి తగిన నిధులు అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అందాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. విద్యార్థుల రాకపోకల భారాన్ని తగ్గించడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాస్‌లను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

schools | colleges | holiday | students | hyderabad

Advertisment
Advertisment
తాజా కథనాలు