/rtv/media/media_files/2025/07/16/telcos-complete-rollout-of-sms-headers-to-identify-messages-2025-07-16-06-55-25.jpg)
Telcos complete rollout of SMS headers to identify messages, reduce spam
మొబైల్ ఫోన్లకు తరచుగా స్పామ్ సందేశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని సులభంగా గుర్తించడం కోసం టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిజమైన మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌ల మధ్య తేడాను ఈజీగా గుర్తించేందుకు ఆ సందేశం చివర్లో ఓ లెటర్‌ను జోడిస్తున్నాయి. వినియోగదారులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) తెలిపింది. ఈ అసోసియేషన్‌లో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మెంబర్స్‌గా ఉన్నాయి.
Also Read: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
ఈ మధ్య కాలంలో ఫోన్‌కొచ్చే మెసేజ్‌లను చూస్తే చివర్లో P,S,T,G లెటర్స్ కనిపిస్తాయి. చివర్లో P అని ఉంటే అది ప్రమోషనల్ అని అర్థం. S అంటే ఆ మేసెజ్‌ల సర్వీసులకు సంబంధించింది. T అంటే ట్రాన్జాక్షన్‌కు సంబంధించింది. G అంటే ప్రభుత్వ సంబంధిత సందేశంగా గుర్తించవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్జాక్షన్ జరిపితే హెడర్ చివర్లో T అనే లెటర్ వస్తుంది. గవర్న్‌మెంట్ సంబంధించిన సమాచారానికి చివర్లో G అని వస్తుంది.
Also read: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన
స్మామ్ మెసేజ్‌లు గుర్తించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు COAI డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచ్చర్ చెప్పారు. పారదర్శకత కోసం తాము ఈ చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్పామర్లు, స్కామ్‌స్టర్లు కొత్త మార్గాలు వెతుకుతున్నారని తెలిపారు. ఎలాంటి నియంత్రణ లేని ఓటీటీ కమ్యూనికేషన్ యాప్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాటిని వాళ్లు వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల స్పామ్‌ను అరికట్టాలన్న ఉద్దేశం దెబ్బతింటోందని తెలిపారు. ఈ పరిస్థితి మారాలంటే ఓటీట కమ్యూనికేషన్ యాప్స్‌పై నియంత్రణ అవసరం ఉందన్నారు.