/rtv/media/media_files/2025/07/16/warden-2025-07-16-07-50-18.jpg)
ఇంటిని వదిలి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వార్డెన్ బరితెగించింది. తాను కూడా ఓ మహిళనే అన్న విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వార్డెన్ ను చితకబాదారు. ఈ ఘటన కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 9 నుంచి ఇంటర్ వరకు 80 మంది విద్యార్థినులు చదువుతూ అక్కడే హాస్టల్ లో ఉంటున్నారు.
అయితే అక్కడ వార్డెన్ గా పనిచేస్తున్న శౌరీబాయి విద్యార్థినులు స్నానాల గదుల్లో ఉన్నప్పుడు తలుపులు వేయవద్దని చెప్పి వారి నగ్న ఫోటోలను, వీడియోలను తీస్తుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడుతుంది. ఇదేంటని ఎవరైనా విద్యార్థినులు ఎదురు తిరిగితే తల్లిదండ్రులకు లేనిపోని మాటలు చెప్పి, ఫిర్యాదు చేస్తూ వచ్చింది. అయితే ఆమె ఆకృత్యాలు రోజురోజుకూ మితిమిరడంతో విద్యార్థినుల జరిగిన విషయాన్ని వారి తల్లిదండ్రులుకు తెలిపారు. దీంతో పాఠశాలకు వచ్చివ వారు ఆమెను చితకబాదారు.
ఈ విషయంపై సత్తెనపల్లి డీవైడీఈవో ఏసుబాబు, ఎంఈవో రవికుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరనాయక్, సీడీపీవో కృష్ణవేణిలకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవో మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులపై విచారణ జరిపామని, వార్డెన్‌పై దాడి చేసింది విద్యార్థినుల తల్లిదండ్రులు కాదని, బయటి వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఉపాధ్యాయులు తెలిపారన్నారు. రిపోర్టులనుఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వివరించారు.
గతంలో ఇదే పాఠశాలలో
గతంలో ఇదే పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు దాడి చేశారు. అప్పట్లో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక అప్పట్లో వార్డెన్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిపైనా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. దీంతో ఆమెతోపాటు ఏడుగురిని అధికారులు సస్పెండ్ చేశారు.