/rtv/media/media_files/2025/07/16/ukrainian-pm-denys-shmyhal-resigns-2025-07-16-07-28-25.jpg)
Ukrainian PM Denys Shmyhal resigns
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు. అయితే జెలెన్‌స్కీ ప్రభుత్వంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వాషింగ్టన్‌లో కూడా ఉక్రెయిన్ రామబారి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉక్రెయిన్ ఉప ప్రధానిగా అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్వైరైదెకోను ప్రధానమంత్రి పదవికి తాను ప్రతిపాదిస్తున్నట్లు జెలెన్‌స్కీ సోమవారమే వెల్లడించారు.
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
అమెరికా, ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చలు జరిగినప్పుడు అప్పటి ఉప ప్రధాని యూలియా కీలక పాత్ర పోషించారు. పశ్చిమ దేశాల మిత్రులతో కూడా జరిగిన పలు ఉన్నతస్థాయి చర్చల్లో ఆమె పాల్గొని కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో యుద్ధం ఆపేయాలని లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యాకు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా మాస్కోను లక్ష్యంగా చేసుకోకూడదని సూచించారు.