Tuvalu: ద్వీప దేశానికి పెద్ద గండం..మరికొన్ని రోజుల్లో కనుమరుగు..భయంతో ప్రజలు

అదొక అందమైన దేశం. నాలుగు వైపులా నీళ్ళు మధ్యలో భూమి ఉండే బుల్లి ద్వీపం. మూడు వేల ఏళ్ళ నుంచి ఉంటున్న ఈ ద్వీప దేశం మరికొన్నేళ్ళల్లో మాయం అయిపోనుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా పూర్తిగా కనుమరుగు కానుంది. 

New Update
Tuvalu

Tuvalu Nation

భూమి మీద పరిస్థితులు నెమ్మదిగా మారిపోతున్నాయి. ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు ఏమీ ఉండడం లేదు. వాతావరణం రోజురోజుకూ తీవ్రంగా మారిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా పోతోంది. దీని వలన ఇప్పటికే చాలా జీవాలు కనుమరుగయ్యాయి. ప్రదేశాలు కనిపించకుండా పోతున్నాయి. ఇప్పుడు వాటి లిస్ట్ లోకి  హవాయ్, ఆస్ట్రేలియాల మధ్యలో ఉండే తువాలు అనే దేశం కూడా చేరిపోనుంది. తొమ్మిది ద్వీపాలతో కూడిన ఈ చిన్న దేశం కొన్నేళ్ళల్లో పూర్తిగా కనుమరుగవనుంది. నేలతో పాటు అక్కడి జన జీవితాలనూ వేడెక్కిన సముద్ర జలాలు కబళిస్తున్నాయి.

నీటి మట్టం పెరుగుతోంది..

తువాలు దేశం రోజురోజుకూ కుంగిపోతోంది. సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. తువాలు భూభాగం సముద్ర మట్టానికి కనిష్ఠంగా 6.6అడుగులు, గరిష్ఠంగా 15అడుగుల ఎత్తులోనే  ఉంది. దేశం మొత్తం కలిపి 25.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 10,643 మంది ప్రజలు. వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ఇక్కడ నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివలన సముద్ర జాలు భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి.  తాగునీటి వనరులు ఉప్పునీటితో కలగలిసిపోతున్నాయి. వ్యవసాయం, జీవనోపాధులు కష్టంగా మారుతున్నాయి. దీంతో తువాలును వదిలి జనాలు వెళ్ళిపోతున్నారు. 

2050 కల్లా తువాలు రాజధాని ఫునాఫుటిలో సగభాగం వరదలతో మునిగిపోతుందని రిసెర్చ్ లు చెబుతున్నాయి. 2100 నాటికి ఆ దేశంలో 95శాతం భూభాగం జలమయం కావచ్చును. ప్రస్తుతం ఆ దేశానికి ఆస్ట్రేలియాతో ఉన్న ఒప్పందం ప్రకారం అక్కడి ప్రజలు తరలి వెళ్ళిపోతున్నారు. అయితే అమెరికా మాత్రం వీసా నిషేధించిన దేశాల జాబతాలో తువాలును ఉంచింది.  తమ భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి తువాలు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ‘కోస్టల్‌ అడాప్టేషన్‌ ప్రాజెక్ట్‌’ కింద ఐక్యరాజ్యసమితి గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్, ఆస్ట్రేలియాల సాయంతో ఫొంగఫలే, నానుమాగా, నానుమీ దీవుల్లో 3.6 చదరపు కిలోమీటర్ల మేర నేలను ఎత్తు చేస్తోంది.

Also Read: NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు