/rtv/media/media_files/2025/07/16/pm-dhan-dhanya-yojana-2025-07-16-17-43-28.jpg)
PM Dhan Dhanya Yojana
భారతీయ సంస్కృతిలో వ్యవసాయం ఒక ముఖ్యమైన వృత్తి. దానికి తగినట్లు ప్రభుత్వాలు వ్యవసాయానికి రాయితీలు ప్రకటిస్తుంటాయి. అలాంటిదే మరో గుడ్ న్యూస్‌తో కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు (జూలై 16) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను బలోపేతం చేసే క్రమంలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
PM Dhan Dhanya Yojana Scheme
దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మండలి సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపిందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అనుమతిచ్చినట్లు తెలిపారు.
Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత నిల్వలను బలోపేతం చేయడం, నీటిపారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణ లభ్యతను పెంచడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని వివరించారు .
Also Read : బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ - కత్రినా బర్త్ డే స్పెషల్ ఫొటోలు !
formers | pm modi | agriculture minister | agriculture | central-govt | central-goverment