/rtv/media/media_files/2025/07/16/kiara-2025-07-16-06-25-41.jpg)
Kiara Advani Baby Girl
Kiara Advani Baby Girl: బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra), కియారా అద్వానీ(Kiara Advani) తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు మొదటి బిడ్డ కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ శుభవార్తతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే, ఈ జంట ఇంకా అధికారికంగా ఈ శుభవార్తను ప్రకటించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Also Read: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
Kiara Advani and Sidharth Malhotra welcome a baby girl
— Nandini Chaar (@ndccomputers) July 15, 2025
Kiara Advani and Sidharth Malhotra welcomed their first child today. The couple was blessed with a baby girl. pic.twitter.com/0GfEIgcMJc
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి
కియారాను డెలివరీ కోసం ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దంపతులకు సెలబ్రేటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో సిద్ధార్థ్, కియారా వివాహం చేసుకున్నారు.
Also Read: మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం
Congratulations! #KiaraAdvani And #SidharthMalhotra Blessed With Baby Girl🥰🥰🥰@advani_kiara@SidMalhotra#BollywoodBubblepic.twitter.com/4GZJVr57D3
— SRIKANT (@SRIKANT_OM) July 15, 2025
Also Read:ఓర్నీ.. లవర్ ఫోన్ మాట్లాడలేదని సూసైడ్ చేసుకున్నాడు!