/rtv/media/media_files/2025/07/16/ravi-teja-2025-07-16-07-29-56.jpg)
Ravi Teja father Death News:
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ(Hero Ravi Teja) ఇంట విషాదం చోటుచేసుకుంది. రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జూలై 15) రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో తుదిశ్వాస విడిచారు. భూపతిరాజు రాజగోపాల్ రాజు స్వస్థలం: తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట. ఆయన రిటైర్డ్ ఫార్మసిస్ట్. రవితేజకు ఇద్దరు సోదరులు ఉన్నారు. రఘు, భరత్. వీరిలో భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
హీరో రవితేజ గారికి పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
— నవభారతం 🇮🇳 🚩🙏 O+ (@VikasitBharat9) July 16, 2025
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం.
ఓమ్ శాంతి 🙏🙏 pic.twitter.com/Si5iBbTbQf
Also Read:సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
రవితేజ తండ్రి మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ మధ్యే నటుడు కోట శ్రీనివాసరావు, నటి బి. సరోజాదేవి మరణాల నుంచి తేరుకోకముందే ఈ వార్త రావడంతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రాజగోపాల్ రాజు అంత్యక్రియలు బుధవారం (జూలై 16) జరగనున్నాయి.