Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్‌ సీన్‌..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు

శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. అయితే చేపల వేట సమయంలో వీరిమధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రాజెక్టులో నీళ్లు విరివిగా ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన్నుకున్నారు.

New Update
Fishermen fighting for fish in Srisailam reservoir

Fishermen fighting for fish in Srisailam reservoir

వర్షకాలం కావడంతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటకు సై అంటున్నారు. శ్రీశైలం జలాశయానికి కూడా జలకళ వచ్చింది. దీంతో జాలర్లు చేపల వేటకు సిద్ధమయ్యారు. చేపలకు మంచి గిరాకీ ఉండటంతో  మత్స్యకారులు చేపల వేటకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. అయితే చేపల వేట సమయంలో వీరిమధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది.

Also Read :  ఫోటో కోసం పోజులియ్యబోయిననేత.. కాలు జారడంతో...

Shocking Scene In Srisailam Reservoir

ఒకవైపు ప్రాజెక్టులో నీళ్లు విరివిగా ఉన్నప్పటికీ వారు ఏమాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. తెప్పల పైనుంచి దూకుతూ కొట్టుకున్నారు. చేతుల్లో ఉన్న తెడ్లనే ఆయుధాలుగా ఉపయోగిస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొత్తం నాలుగు తెప్పల్లో ఉన్న మత్స్యకారులు.. ఒకరిపై ఒకరు కర్రలు, తెడ్డు కర్రలతో దాడులు చేసుకుంటూ నది మధ్యలో బీభత్సం సృష్టించారు. లింగాలగట్టు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావటంతో పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు.

Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో చేపట వేటకు వెళ్లిన మత్స్యకారుల మధ్య చెలరేగిన చిన్న గొడవ ఘర్షణకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. జలాశయం మధ్య చేపలు పట్టే విషయంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దాడుల వరకు వెళ్లినట్లు తెలిసింది. తెప్పలపై చేపల వేట సాగిస్తున్న సమయంలో.. నది మధ్యలోనే గొడవపడ్డారు.. తెడ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు.ఈ దాడుల్లో కొంతమంది మత్స్యకారులు గాయపడ్డారు. 

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

పైనుంచి వస్తున్న వరద నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణా నదిపై రెండు నెలలు పాటు చేపల వేటను నిషేదించారు. అయినప్పటికీ అనుమతి లేకుండా లింగాలగట్టు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లటం.. వెళ్లిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసు శాఖ అలర్ట్‌ అయింది. ఈ ఘటనపై  స్పందించిన పోలీసులు వారంతా బంధువులే అని.. చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం, కొట్టుకోవటం జరిగిందని అందరినీ పిలిపించి బైండోవర్ కేసు పెట్టినట్లు తెలిపారు.

Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం

srisailam-dam | srisailam-project | srisailam-reservoir | fisherman | fishermen | Fishermen's Service | fighting | police-cases

Advertisment
Advertisment
తాజా కథనాలు