/rtv/media/media_files/2025/07/16/miscreants-pour-petrol-on-husband-and-wife-and-set-them-on-fire-in-palnadu-2025-07-16-09-09-03.jpg)
Miscreants pour petrol on husband and wife and set them on fire in Palnadu
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బీసీ కాలని సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు శ్రీను, మంగమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు వాళ్లని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఈ ఘటనకు కారణం శ్రీను తమ్ముడి కొడుకని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహారిగోడ విషయంలో గత కొన్ని రోజులుగా శ్రీను, అతడి సోదరుడి మధ్య వివాదం జరుగుతోంది. వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. మరోవైపు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్
ఇదిలాఉండగా పల్నాడులోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జల్సాలకు అలవాటు పడ్డాడడని కొడుకును ఓ తండ్రి చంపి పాతరేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొడుకు మంగ్యానాయక్ కొద్దిరోజులుగా తండ్రి వేంకటేశ్వర్లు నాయక్ కి తెలియకుండా గొర్రెపిల్లలను అమ్ముకొని ఆ డబ్బుతో జల్సా చేస్తున్నాడు. దీని గురించి తండ్రీకొడుకుల మధ్య పలుమార్లు వివాదం జరిగింది. ఎంత చెప్పినా కొడుకు తన తీరును మార్చుకోకపోవడంతో కోపం, విసుగు చెందిన వెంకటేశ్వర్లు.. పదిరోజుల క్రితం కొడుకును చంపి ఎర్రబాలెం కాలువ సమీపంలో పాతిపెట్టాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పోలీస్ దర్యాప్తులో తానే కొడుకును హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.