CM Revanth Reddy : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్‌ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
CM Revanth

CM Revanth reddy

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని, వాటి వల్ల ఏర్పడిన వివాదాలనే ఇప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. బనకచర్ల కడతామనే చర్చ రానపుడు, ఆపమనే చర్చనే రాదన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థలే బనకచర్లకు అభ్యంతరం తెలిపాయని గుర్తు చేశారు.

Also Read:Baahubali The Epic Run Time: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం‌పై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!

KCR Has Given Telangana Water Rights To AP

ఈ భేటీలో ముఖ్యంగా 4 అంశాలు చర్చించామని తెలిపారు. కృష్ణా నీటి వాడకానికి టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి ఏపీ ఒప్పుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పడిన డ్యామేజీని సవరించడానికి చర్యలు చేపడతాం అన్నారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందన్నారు. గతంలో తెలంగాణ హక్కులను కేసీఆర్‌ ఏపీకి ధారాదత్తం చేశారన్నారు. ఈ బేటీలో కేంద్రం కేవలం నిర్వహక పాత్ర పోషించిందన్నారు. కేంద్రం ఎవరివైపు కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మీటింగ్‌ ఏజెండా బనకచర్ల అంశం లేదన్నారు. కృష్ణ జలాల వినియోగంపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తారని, దాని ఆధారంగానే మిగిలిన నిర్ణయాలుంటాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.  

Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీలో కృష్ణా బోర్డు, తెలంగాణ గోదావరి బోర్డు ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు సుముఖం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని, వివాదాలను పరిష్కరించుకుంటామని తెలియజేశారు. ఇది అపెక్స్ మీటింగ్ కాదని, సాధారణ సమావేశం అన్నారు. కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని, వాటి వల్ల ఏర్పడిన వివాదాలనే ఇప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తాయని, కానీ వాటిని మేము పట్టించుకోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. 

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

Also Read :  ఫస్ట్ నైట్ రోజే వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. వరుడు చేసిన పనికి పెళ్లింట రచ్చ రచ్చ!

minister-uttam-kumar-reddy | Banakacharla | banakacherla project | godavari-water | dellhi | krmb-project | krmb-meet | cm-revanthreddy | ap cm chandra babu naidu

Advertisment
Advertisment
తాజా కథనాలు