/rtv/media/media_files/2025/07/16/f-singh-2025-07-16-08-48-09.jpg)
పంజాబ్‌లో మారథానర్ ఫౌజా సింగ్ మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో ఒక ఎన్నారై (NRI) డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్ పిండ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్‌ను ఢీకొట్టిన డ్రైవర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్‌గా గుర్తించారు. అతను కెనడాలో నివాసముంటూ, కొద్ది రోజుల క్రితం పంజాబ్‌కు వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం ఫౌజా సింగ్ రోడ్డు దాటుతుండగా, నిందితుడు నడుపుతున్న తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుండి పారిపోయాడు.
The world's oldest marathon runner, Fauja Singh, died in a hit-and-run at 114 years old while walking on a road near his hometown in northwestern India, according to the Indian police.
— Wunderkind (@EngineerNGR) July 16, 2025
Police say they are still searching for the driver.
డ్రైవర్ నిర్లక్ష్యంగా
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కారు లైట్ శకలాలు, టోల్ ప్లాజా రికార్డులను పరిశీలించి కారును గుర్తించారు. కారు యజమానిని ప్రశ్నించగా, అతను కారును అమృత్‌పాల్ సింగ్‌కు విక్రయించినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి పోలీసులు నిందితుడిని అతని స్వగ్రామంలో అరెస్టు చేశారు. అతను తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడం, ప్రమాదం తర్వాత సహాయం చేయకుండా పారిపోవడం వంటి నేరాల కింద అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నారు. ఫౌజా సింగ్ మరణ వార్త ఆయన అభిమానులను ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు.