/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
TG Crime: ఈ మధ్యకాలంలో కుటుంబాల మధ్య వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఈ కారణంతో భర్తలను భార్యలు చంపడం సర్వసాధారణమైంది. అయితే వివాహితతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికేవారి రమేష్ హత్యకు గురయ్యాడు.
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అడికే వారి రమేష్ కు గత పది సంవత్సరాల క్రితం మహాదేవి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా గత సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య గొడవతో మహాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుండి రమేష్ బిచ్కుంద మండల కేంద్రంలోని మారేడు గుడి దగ్గర ఉన్న ఓ వ్యక్తి ఇంటిలో కిరాయికి ఉంటున్నాడు. బుధవారం ఉదయం తెల్లవారుజామున బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామానికి చెందిన కాశీనాథ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చి రమేష్ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్ళి రమేష్ ఇంటి నుండి బయటకు రాగానే కమ్మకత్తితో రమేష్ తల పైన, వీపులో బలంగా నరికాడు. దీంతో రమేష్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
కాగా ఈ విషయం తెలిసిన రమేష్ తల్లి గంగమణి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలిపించింది. కాగా తన కొడుకు చావుకి కాశీనాథ్ అనే వ్యక్తే కారణమని, కాశీనాథ్ భార్య శ్యామలకు, తన కుమారుడు రమేష్ కు గల అక్రమ సంబంధం కారణంతోనే తన కొడుకుని చంపి వేశాడని గంగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు.
Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం