పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది.

New Update
Pakistan PM Shehbaz sharif

Pakistan PM Shehbaz sharif

పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది. ఇందులో పాక్‌ ఆర్థిక వ్యవస్థ దుస్థితి గురించి ఆయన వివరించారు. నావికాదళ యుద్ధనౌక ప్రాజెక్టు MILGEM నిధుల లేక ఆగిపోయిందని తెలిపారు. అలాగే MILDEN జలాంతర్గామి ప్రాజెక్టు కూడా నిలిచిపోయిందని చెప్పారు. అలాగే బకాయి చెల్లింపును 23 ఏళ్లు వాయిదా వేయాలని టర్కీని అభ్యర్థించారు. పాక్‌లో అలా అర్ధాంతరంగా ప్రాజెక్టులు నిలిచిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

పాక్‌లో టర్కీ ఫ్యాక్టరీ ?

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్, టర్కీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. పాక్‌ వైమానిక దళంతో కలిసి ఆ దేశంలో ఓ పెద్ద ఆయుధ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు టర్కీ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా నివేదికలో వెల్లడైంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోయే స్థలం గ్రౌండ్ సర్వే పూర్తయ్యింది. అలాగే  'ప్రాజెక్ట్ ఇక్బాల్' అనే కోడ్ పేరుతో పాకిస్తాన్ కోసం హై ఆప్టికల్ శాటిలైట్ కెమెరాను టర్కీ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు క్లిష్టమైన డిజైన్ సమీక్ష దశకు కూడా చేరుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల ఇది పెండింగ్‌లో ఉంది. 

Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

టర్కీకి చెందిన BAYKAR ఆయుధ తయారీ సంస్థలో ప్రాణాంతకమైన TB1, TB2 డ్రోన్లు ఉన్నాయి. పాక్‌ కూడా ఈ డ్రోన్లను టర్కీ నుంచి కొనుగోలు చేసింది. పాక్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలో వాళ్ల ఉత్పత్తులు డిజైన్ చేయనున్నారు. అలాగే అన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలను తయారు చేయనున్నారు. 

టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసిన తర్వాత పాకిస్తాన్ తమ వైమానిక దళ అధికారులకు టర్కీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. TB-2 డ్రోన్‌ను ఆపరేట్ చేయడానికి మొదటి బ్యాచ్‌లో 6 మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు శిక్షణ ఇచ్చారు. అలాగే మరో 12 మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు అకిన్సి డ్రోన్‌ను ఆపరేట్ చేసే ట్రైనింగ్ అందించారు. అకిన్సి అనేది టర్కీకి చెందిన కొత్త సాయుధ డ్రోన్. ఈ డ్రోన్‌ను విక్రయించిన మొదటి దేశం పాకిస్తానే. రిపోర్టు ప్రకారం.. 2023లో పాకిస్తాన్‌కు 6-7 డ్రోన్లు డెలివరీ అయ్యాయి. 2022లో పాకిస్తాన్.. టర్కీ నుంచి TB-2, అకిన్సి డ్రోన్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు