Devi Sri Prasad Energy Secret
Devi Sri Prasad Energy Secret: పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడానికి, ఎనర్జీ మాత్రమే సరిపోదు అందుకు బ్రీత్ కంట్రోల్, స్టామినా, మెంటల్ ఫోకస్ అన్నీ అవసరం. మ్యూజిక్ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, స్టేజ్ పర్ఫార్మర్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ (DSP) తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ల వెనుక అసలైన సీక్రెట్ ఏమిటో వివరించారు.
"మీ కోర్ స్ట్రెంగ్త్ బాగుంటే, మీరు ఎంత కష్టమైన శారీరక కదలికలైనా సులభంగా చేస్తూనే బ్రీత్‌ని కంట్రోల్ చేయగలరు. డ్యాన్స్ చేస్తూనే పాట పాడాలంటే శరీరానికి మంచి ట్రైనింగ్ అవసరం," అని DSP చెప్పారు.
Also Read:సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
డీఎస్పీ ఫిట్‌నెస్ సీక్రెట్ ప్లాన్..
తాను ప్రతిరోజూ బాడీ యాక్టీవ్ గా ఉండేలా చూసుకుంటానని, "వాకింగ్, రన్నింగ్, జంపింగ్ లేదా స్కిప్పింగ్ ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంటారని. ఇది ఎవ్వరైనా చేయగలిగే సింపుల్ వ్యాయామం, ఇది శరీరానికే కాక, మనస్సుకీ చాలా మంచిదంటూ DSP చెప్పుకొచ్చారు."
స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ముందు తాను ఆహారం తీసుకోరట. ఎందుకంటే తిన్న తర్వాత శరీరం బరువుగా అనిపిస్తుంది. ఎనర్జీ మిస్ అవుతుంది. ఖాళీ కడుపుతో డ్యాన్స్, సింగ్ చేయడం చాలా తేలిక అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
ఇంటిని జిమ్‌లా మార్చుకున్న డీఎస్పీ!
తన హాబీలు, హెల్త్ రెండూ బ్యాలెన్స్ చేయడానికి ఇంటిలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారట DSP. "నాకు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నా హోమ్ థియేటర్‌లోనే ట్రెడ్‌మిల్ పెట్టించాను. అక్కడే బెడ్ కూడా ఉంది. ఉదయం లేవగానే బెడ్ నుండి నేరుగా ట్రెడ్‌మిల్ మీదికి వెళ్లిపోతాను. అదే సమయంలో వెబ్ సిరీస్ చూస్తూ వర్కౌట్ చేస్తాను. ఒక ఎపిసోడ్ చూసినంతలో వర్కౌట్ అయిపోతుంది, రిఫ్రెష్ కూడా అవుతాను."
Also Read:మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం
ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్‌పుల్ పాటలు..
తన తదుపరి ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా డీఎస్పీ చిన్న క్లూస్ కూడా ఇచ్చారు. “హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో వస్తున్నఉస్తాద్ భగత్ సింగ్ పాటలు ఫ్యాన్స్ కు పక్కా నచ్చుతాయంటూ,” ఆయన తెలిపారు.