/rtv/media/media_files/2025/07/16/monsoon-session-of-parliament-to-run-from-july-21-to-august-12-2025-07-16-10-39-45.jpg)
Monsoon session of Parliament to run from July 21 to August 12
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పలు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు విపక్షాలు కూడా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదికను విపక్షాలు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించిన అంశాన్ని కూడా లేవనెత్తనున్నాయి.
Also Read: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!
అలాగే బీహార్‌లో ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల సవరణపై క్లారిటీ లేదనే విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ విషయంలో పారదర్శకత లేదని కూడా విపక్షాలు వాదించనున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం పలు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.పన్నులను సవరణ బిల్లు
దేశంలో ట్యాక్స్ సిస్టమ్‌ను మరింత ప్రామాణికంగా, సమర్థవంతంగా చేయడం కోసం పలు పన్ను చట్టాల్లో మార్పులను ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించనున్నారు.
2. జన్ విశ్వాస్ బిల్లు
ఈ బిల్లు వ్యాపార వ్యవస్థపై భారం తగ్గించనుంది.
3.ఆదాయపు పన్ను బిల్లు (Income Tax Bill, 2025)
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) తాజాగా దీన్ని సమీక్షించింది. ఈ బిల్లును ఈసారి పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.
4. జియోహెరిటేజ్ సైట్స్ బిల్లు
దేశంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకురానుంది.
5.జాతీయ క్రీడా పాలన బిల్లు
క్రీడా సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపర్చేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.
6.మణిపూర్‌పై స్పెషల్ ఫోకస్
పార్లమెంట్‌లో మరోసారి మణిపూర్ అంశం కీలకం కానుంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.