Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

తండ్రి చేతిలో హత్యకు గురైన  టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఆమె ఫ్రెండ్ హిమాన్షిక సంచలన విషయాలు వెల్లడించింది.

New Update
Radhika yadav

Radhika yadav

హరియాణాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా తన కన్నతండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఆమె ఫ్రెండ్ హిమాన్షిక సంచలన విషయాలు వెల్లడించింది. రాధికా ప్రతి కదలికపై ఆమె తల్లిదండ్రులు నిఘా పెట్టేవారు. టీషర్టులు, షార్ట్స్ వేసుకోవడం కూడా  సిగ్గుగా భావించేవారని తెలిపింది. ఆమె అబ్బాయిలతో మాట్లాడడమే నేరంగా చూసేవారని, ఆమె చుట్టూ ఎన్నో ఆంక్షలు విధించారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగా.. రాధికా తమకు నచ్చినట్లుగా ఉండట్లేదనే కోపంతోనే తండ్రి ఆమెను చంపినట్లు తెలుస్తోంది. 

Also Read: Radhika Yadav: నన్ను ఉరి తీయండి..టెన్నిస్ ప్లేయర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Also Read :  17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలు.. అదిరిపోయే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

అనేక కోణాలు

రాధికా యాదవ్‌ హత్యకేసులో ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె తరచుగా అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం వాటిలో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక గతేడాది ఓ అర్టిస్ట్‌తో కలిసి మ్యూజిక్‌ రీల్స్‌ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా వారు చెబుతున్నారు. అలాగే రాధిక టెన్నిస్‌ అకాడమీని నిర్వహించడం కూడా తండ్రికి ఇష్టం లేకపోవడమే వారిద్దరి మధ్య ఘర్షణకు కారణమని అంటున్నారు. టెన్నిస్‌ అకాడమీని మూసివేయాలని దీపక్‌ అనేకసార్లు కోరినట్టు తెలుస్తోంది. అయితే, అందుకు ఆమె నిరాకరించిందని, రూ.2 కోట్లు ఖర్చు చేసి నేర్చుకున్న కెరీర్‌ను వదులుకోమని చెప్పడం సమంజసం కాదని వాదించిందని కథనాలు వినవస్తున్నాయి.

Also Read: Monica Song: 'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

Also Read :  ముదురుతున్న భాషా వివాదం.. మారాఠీ రాదన్న ఆటో డ్రైవర్‌పై దాడి

Advertisment
Advertisment
తాజా కథనాలు