/rtv/media/media_files/2025/07/16/cyber-crime-2025-07-16-08-39-29.jpg)
Cyber Crime
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే రూ.7 వేల కోట్లు ప్రజల నుంచి కాజేయడం కలకలం రేపుతోంది. అలాగే మే నుంచి జులై మధ్య సైబర్ కేటుగాళ్లు కొట్టేసిన మొత్తం కలుపుకుంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. OTP నుంచి డిజిటల్ స్కామ్ వరకు సైబర్ నేరగాళ్లు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ నేరాలు చేసే వాళ్లందరూ ఆగ్నేసియా దేశాలు కాగా చైనీయులే దీన్ని చేయిస్తున్నారని నిఘా విభాగం తెలిపింది.
అమాయకులకు వల వేసి వివిధ రూట్లలో డబ్బు కాజేస్తున్న వాళ్లు మయన్మార్, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్, కంబోడియా దేశాలకు చెందినవారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా వెల్లడించింది. వీళ్ల వెనకుంది మాత్రం చైనీయులేనని స్పష్టం చేసింది. నెలకు ఏకంగా రూ.1000 కోట్లు కాజేయాలని వీళ్లు టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొంది.
Also Read: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టొచ్చు
ఇక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) డేటా ప్రకారం భారత్‌లో జనాల నుంచి కొట్టేసే డబ్బు ఈ ఆగ్నేసియా దేశాలకు వెళ్తున్నట్లు తేలింది. ఈ ఏడాది జనవరిలో సైబర్ నేరగాళ్లు రూ.1,192 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మే లో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతం చూసుకుంటే ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టు, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, నెంబర్‌పై ఆఫర్ ఉందని చెప్పి మోసం చేయడం, పెళ్లి చేసుకునేందుకు అమెరికా నుంచి వస్తున్నట్లు నమ్మించడం వంటి అనేక మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
Also Read: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్
ఇక్కడ మరో విషయం ఏంటంటే సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కాజేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లో మనవాళ్లనే ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వందల కొద్ది ఏజెంట్లు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. అందుకే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలియని లింకులు నొక్కవద్దని, బ్యాంక్ డీటైల్స్ ఎవరికి చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా కూడా జనాలు వాళ్ల ఉచ్చులో పడటం ఆందోళన కలిగిస్తోంది.