/rtv/media/media_files/2025/07/16/subramanya-2025-07-16-06-56-48.jpg)
Mallavaram Subrahmanya Swamy Temple: మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, ఏ.కె. మల్లవరం (పాముల మల్లవరం) గ్రామంలో ఉంది(Subrahmanya Swamy Temple in East Godavari). ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనదిగా,అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందినదిగా భక్తులు నమ్ముతారు. సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించి, దోష నివారణ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని సంతాన ప్రదాతగా భావిస్తారు. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ ఆలయాన్ని ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయంగా అభివర్ణించారు. ఇక్కడ స్వామివారు విభూదితో నిత్యం ప్రకాశిస్తుంటారని, విశేష శక్తి కలిగి ఉన్నారని ఆయన ఓ ప్రవచనంలో తెలిపారు.
Also Read:సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ఈ ఆలయ చరిత్ర 1961లో ఒక రైతు పొలంలో ఒక గోధుమ రంగు త్రాచుపాము కనిపించడంతో మొదలైంది. ఆ పాము ఎవరికీ హాని చేయకుండా, ప్రశాంతంగా శివలింగం చుట్టూ తిరుగుతూ ఉండేది. గ్రామస్తులు ఆ పాముకు దైవిక శక్తి ఉందని నమ్మి, అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత, ఆ నాగ దేవత అదే స్థలంలో ప్రాణం విడిచిపెట్టింది. పండితుల సూచన మేరకు, ఆ పామును అక్కడే సమాధి చేసి, దానిపై సర్ప రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
Also Read: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
శివలింగం వద్దకు వచ్చి
ఆలయంలో ఒక నాగుపాము నిత్యం శివలింగం వద్దకు వచ్చి ఉంటుందని, భక్తులు పూజలు చేసినా కదలదని చెబుతారు.: ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి, షష్ఠి మంగళవారం కలిసిన రోజుల్లో, మాసశివరాత్రి రోజున విశేష పూజలు జరుగుతాయి. స్కంద షష్ఠి, ఆడికృత్తిక, నాగ పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
Also Read:మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం
షష్టి రోజున దంపతులు ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేయాల్సి ఉంటుంది. ఒకరోజు ముందుగానే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయం పూట కోనేటిలో దంపతులిద్దరూ స్నానం చేసాక ఆలయంలోనే ఆడవారికి నాగుల చీర, మగవారికి కండువా ఇస్తారు. దీని ధరించాల్సి ఉంటుంది. అనంతరం ఆడవారిని ఆలయ వెనుక ఉన్న రూమ్ లో నిద్రించమని చెబుతారు. వారికి కునుక పడ్డాక లేపుతారు. అనంతరం స్వామి వారికి పూజ చేయాల్సి ఉంటుంది. ఇలా మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. అదృష్టం ఉన్నవారికి ఒక్కసారి వెళ్లిన సంతానం కలిగిందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. డాక్టర్లు సైతం పిల్లలు పుట్టరని చెప్పేసిన వాళ్లుకు కూడా ఈ ఆలయానికి వచ్చి నిద్ర చేసి పూజులు చేసిన వారికి పిల్లులు పుట్టారని ఆలయ పూజరులు,ధర్మకర్తలు చెబుతున్నారు.
ఆలయ చిరునామా:
శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం,
మల్లవరం, చేబ్రోలు(వయా), గొల్లప్రోలు మండలం,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్,
పిన్ కోడ్ – 533449.
ఈ ఆలయం కాకినాడ నుండి సుమారు 34 కి.మీ. దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ పిఠాపురం (17 కి.మీ.).
అన్నవరం నుంచి కూడా దగ్గరగానే ఉంటుంది.