/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
BIG BREAKING: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పరిణామాలు మాత్రం జోరుగా సాగతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. మాజీమంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది.
హైదరాబాద్ లోని మేకలమండికి చెందిన ఒక బీజేపీ నాయకుని ఇంట్లో కేంద్రమంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి లంచ్ చేయడంతో ఆమె బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి తెరలేపింది. ప్రీతిరెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటిది బండి సంజయ్‌తో భేటీ కావడం ఇరు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
MLA Mallareddy Daughter-In-Law Prithi Reddy
అంతేకాదు, ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనడానికి గుర్తుగా నిన్న పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ మరునాడే ఇరువురు ప్రత్యేకంగా సమావేశం కావడం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరేం లేదని పలువురు అంటున్నారు. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ఉహాగానాలు వినవస్తు్న్నాయి. ఈ క్రమంలో గోషామహల్ కు ఉప ఎన్నికలు తప్పవని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి ఈ సీటును మాధవీలత ఆశిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే పార్టీలైన్ దాటి మాదవీలత చేస్తున్న కామెంట్స్ కొన్ని ఇటీవల వైరల్‌గా మారాయి. దీంతో పాటు పాతబస్తీలో మాధవీలతపై వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి గోషామహల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది.
Also Read: Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
Also Read : షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!
- Jul 22, 2025 12:00 IST
Telangana TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
- Jul 22, 2025 12:00 IST
Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!
- Jul 22, 2025 10:50 IST
Jagdeep Dhankhar: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్‌ఖడ్ రాజీనామాకు బలమైన కారణం అదేనా?
- Jul 22, 2025 10:50 IST
Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్
- Jul 22, 2025 10:50 IST
Jagdeep Dhankhar : పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్
- Jul 22, 2025 10:49 IST
Jagdeep Dhankhar: న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్‌దీప్ ధన్‌ఖడ్ గురించి ఆసక్తిర విషయాలు
- Jul 22, 2025 10:03 IST
Signs of Weak Person: ఈ 13 లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ లైఫ్ మటాషే!
- Jul 22, 2025 08:45 IST
Farokh Engineer : భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం!
- Jul 22, 2025 08:44 IST
Gita Gopinath: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్
- Jul 22, 2025 07:53 IST
Earthquake: హరియాణాలోని ఫరీదాబాద్‌లో భూకంపం
- Jul 22, 2025 07:53 IST
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
- Jul 22, 2025 07:52 IST
Crime News: 150 లగ్జరీ కార్లు కొట్టేసి.. 20 ఏళ్లుగా ఎంజాయ్..చివరికి
- Jul 22, 2025 07:51 IST
Earth Rotation Speed: భూమికి ఏం జరుగుతోంది..? భయపెడుతున్న శాస్త్రవేత్తల అంచనా..!
- Jul 22, 2025 07:01 IST
Honey Trap: వలపు వలలో చిక్కి .. ఆర్మీ సమాచారాన్ని లీక్ చేశాడు.. చివరికి
హనీట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్‌డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి మల్లికార్జున్ రెడ్డిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022లో జూన్‌లోనే ఈ కేసు నమోదైంది. దేశ రక్షణకు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు.
Honey -trapped drdl- contract -employee shared details of Indian ramy secret information