/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
AP BREAKING NEWS
ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పుల చేర్పుల కోసం కేబినెట్ సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు మంత్రులతో ఈ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ను నియమించారు. ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘానికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని వెల్లడించింది. పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Also Read : రేప్ చేశాడని కేసు పెట్టిన యువతికి దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు!
సరిహద్దుల దూరమే ప్రామాణికం..
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని తెలిపింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని స్పష్టం చేసింది. సరిహద్దులు, పేర్ల మార్పుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఎ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read : రాకుమారిలా ముస్తాబైన శ్రీముఖి.. అబ్బా ఫొటోలు భలే ఉన్నాయి!
ఏపీలో జిల్లాలు, మండలాల పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం వేసిన ఏపీ ప్రభుత్వం. pic.twitter.com/MbCK3RTfDZ
— greatandhra (@greatandhranews) July 22, 2025
Also Read : భారత్‌కు పండగ లాంటి వార్త.. పాక్‌లోని ఆ దుర్మార్గుడు చచ్చాడు.. వాడు చేసిన పాపాలు ఇవే!
ఏపీలో గత జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే.. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న అభిప్రాయాన్ని పలువురు ఆ రోజు నుంచి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పు కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
YS Jagan | telugu-news | telugu breaking news