/rtv/media/media_files/2025/07/22/avatar-fire-and-ash-2025-07-22-11-43-35.jpg)
Avatar Fire and Ash
Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్(James Cameron) రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ "అవతార్: ఫైర్ అండ్ ఆష్" గురించి సినీప్రేమికుల్లో ఇప్పటికే మంచి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ‘అవతార్’ ఫ్రాంచైజీ ఇప్పటికే రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలను సాధించింది. ఇప్పుడు మూడో భాగానికి సిద్ధమవుతోంది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/22/avatar-3-2025-07-22-11-44-24.jpg)
కథలోకి కొత్త విలన్..
ఈ కొత్త పోస్టర్ ద్వారా "వరంగ్" అనే కొత్త విలన్ పరిచయం చేశారు. ఈ పాత్రను ప్రముఖ నటిగా ఎదుగుతున్న ఊనా చాప్లిన్ పోషించనున్నారు. వరంగ్ - "మంగక్వాన్" అనే తెగకు నాయకురాలు - నావీలు నివసించే అగ్నిపర్వతాల సమీపంలోని ప్రమాదకర ప్రాంతంలో జీవించేది. ఆమె గుణ స్వభావాలు, ఆమె కఠిన నిర్ణయాలు కథలో ఆసక్తికర మలుపులను తీసుకురానున్నాయి.
Meet Varang in Avatar: Fire and Ash.
— Avatar (@officialavatar) July 21, 2025
Be among the first to watch the trailer, exclusively in theaters this weekend with The Fantastic Four: First Steps. pic.twitter.com/MZi0jhBCI5
పవర్ఫుల్ విలన్ గా..
దర్శకుడు జేమ్స్ కామెరూన్ తాజా ఇంటర్వ్యూలో వరంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె దుర్భర పరిస్థితుల్లో పెరిగిందని, అందువల్లే ఆమె కఠినంగా మారిందన్నారు. అవసరమైతే ఆమె తాను నమ్మినవారి కోసం ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకోగలదని తెలిపారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
ట్రైలర్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్ కోసం మరో గుడ్ న్యూస్ ఏమిటంటే "అవతార్: ఫైర్ అండ్ ఆష్" ట్రైలర్‌ను జూలై 25న విడుదలవ్వనున్న ‘ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 19, 2025 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
కథలో కొత్త విలన్ వరంగ్ ఎంట్రీతో, "అవతార్: ఫైర్ అండ్ ఆష్" సినిమాపై మరింత హైప్ పెరిగింది. అవతార్ ప్రపంచానికి ఇది ఒక కొత్త కోణాన్ని తెస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి అవతార్ మూడవ భాగంగా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజై ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా