Gita Gopinath: ఐఎంఎఫ్‌ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్‌

అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గీతా గోపీనాథ్‌ ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఐఎంఎఫ్‌ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. గీతా గోపీనాథ్ 2019లో IMF చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు.

New Update
IMF Deputy Managing Director Gita Gopinath

IMF Deputy Managing Director Gita Gopinath

Gita Gopinath : IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ పదవి నుంచి గీతా ఆగస్టులో వైదొలగుతారని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గీతా గోపీనాథ్‌ ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఐఎంఎఫ్‌ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

గీతా గోపీనాథ్ 2019లో IMF చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధానాలు రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2022లో IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలోకి ప్రమోట్ కావడం ద్వారా ఆమె మరో మైలురాయి సాధించారు. గ్లోబల్ పాండమిక్, ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట పరిస్థితుల్లో IMF‌కు మార్గదర్శకత్వం ఇచ్చారు.

Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆమె తిరిగి హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరనున్నారు. ఆమె తర్వాత ఆ పదవి చేపట్టే వ్యక్తి పేరును త్వరలోనే ప్రకటిస్తామని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలిన్‌ జార్జివా తెలిపారు.  గీతా గోపీనాథ్‌ అకడమిక్ రంగంలోనే గణనీయమైన సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. IMFలో చేసిన సేవల అనంతరం ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపక బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

 గీతా విశ్లేషణాత్మక ఆలోచనలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఆమె అవగాహన హార్వర్డ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. IMFలో ఆమె చూపిన నైపుణ్యం, నాయకత్వం ప్రపంచ ఆర్థిక రంగంలో చిరస్మరణీయంగా నిలిచే అవకాశముంది.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు