/rtv/media/media_files/2025/07/22/jagdeep-dhankhar-2025-07-22-10-44-08.jpg)
Jagdeep Dhankhar
జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. ఇది అసలు కారణం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. '' జగ్‌దీప్ ధన్‌ఖడ్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైరీ కమిటీ(BAC) కమిటీకి అధ్యక్షత వహించారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో పాటు మరికొందరు దీనికి హాజరుకాలేదు. చర్చల తర్వాత సాయంత్రం 4.30 గంటలకు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.
Also Read: ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానితులకు గాయాలు
ఈసారి కూడా జేడీ నడ్డా, కిరణ్ రిజిజు రాలేదు. వాళ్లు రాకపోవడంతో ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్నిబట్టి చూస్తే సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో పెద్ద విషయమే చోటుచేసుకుంది. జేడీ నడ్డా, కిరణ్ రిజిజు కావాలనే ఆ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆరోగ్య కారణాల వల్ల ఇలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయన నిర్ణయాన్ని మనం గౌరవించాలి. కానీ దీనికి లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోందని'' రమేశ్ తెలిపారు.
అంతేకాదు ధన్‌ఖడ్ పదవీకాలంలో రైతుల సంక్షేమం గురించి నిర్భయంగా మాట్లాడేవారని జైరాం రమేశ్ అన్నారు. ప్రజా జీవితంలో న్యాయపరమైన జవాబుదారీతనం, సంయమనం గురింటి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఆయన నిబంధలకు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జైరాం రమేశ్ ఆరోపణలపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ సమావేశానికి ముందే తమకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారని స్పష్టం చేసారు. ఇదిలాఉండగా 2022 ఆగస్టు 11న జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 ఆగస్టు వరకు ఆయనకు ఈ పదవీ కాలం ఉంది. కానీ మూడేళ్లకే ఆయన పదవి నుంచి వైదొగాలని నిర్ణయం తీసుకున్నారు. ధన్‌ఖడ్ రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నిర్వహించనున్నారు.
Also Read: "నిమిషా ప్రియా విడుదల అవుతుంది".. కె.ఏ. పాల్ సంచలన వీడియో!