Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్‌ రెడ్డి డిమాండ్స్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఇంటి భోజనం, ఒక అటెండర్, కెన్లీ వాటర్ బాటిళ్లు, కొత్త పరుపు, కొత్త మంచం, వెస్ట్రన్ కమోడ్‌తో ప్రత్యేక గది ఇప్పించాలన్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఇంటి భోజనం, ఒక అటెండర్, కెన్లీ వాటర్ బాటిళ్లు, కొత్త పరుపు, కొత్త మంచం, వెస్ట్రన్ కమోడ్‌తో ప్రత్యేక గది ఇప్పించాలన్నారు. అలాగే ఒక టీవీ, న్యూస్ పేపర్స్, దోమతెర, వాకింగ్ షూ అందించాలని కోరారు.   

Also Read: ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్‌ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానితులకు గాయాలు

ప్రొటీన్ పౌడర్, టేబుల్, పెన్నులు, పేపర్లు కూడా అందించాలని అభ్యర్థించారు. అయితే మిథున్ రెడ్డి పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమండ్రి జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. నేరుగా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని చెప్పింది. ఇదిలాఉండగా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు వరకు ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 

Also Read: న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గురించి ఆసక్తిర విషయాలు

Advertisment
తాజా కథనాలు