Sonu Sood: అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్

సోనూ సూద్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ఫోన్ చేసి తమను పరామర్శించి రూ. లక్ష సహాయం ఇస్తామన్నారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. అది కూడా ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఆవేదన చెందారు.

New Update

సినీ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి నటుడు సోనూ సూద్ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఫిష్ వెంకట్ మరణించిన వెంటనే సోనూ సూద్ పీఏ ఫోన్ చేసి పరామర్శించారని.. సోనూ సూద్ తక్షణ సహాయం కింద రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని జోరుగా వార్తలు సాగాయి. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Fish Venkat Wife Sensational Comments

అయితే ఈ వార్తలు వాస్తవమే కానీ.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సహాయం అందలేదని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సోనూ సూద్ నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు RTV ఛానెల్‌తో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

సోనూ సూద్ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి డబ్బు అందలేదని పేర్కొన్నారు. అది కూడా ఫేక్ కాలా లేక నిజమా? అనేది తనకు కూడా అర్థం కావడం లేదని ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్ అయ్యారు. అనంతరం సినీ పరిశ్రమ నుంచి తమకు తగినంత మద్దతు లభించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఉన్నప్పుడు పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదని, కొందరు మాత్రమే చిన్న మొత్తాల్లో సహాయం చేశారని ఆమె అన్నారు. ఫిష్ వెంకట్ అభిమానులు మాత్రం బాగా సహాయం చేశారని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ మాత్రమే తమకు రూ. 2 లక్షలు ఇచ్చారని, దాతను వెతకడంలో కూడా తగినంత మద్దతు లభించలేదని వాపోయారు. ఇప్పటికీ ప్రభాస్ నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నామని సువర్ణ తెలిపారు. 

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

sonu-sood | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
తాజా కథనాలు