/rtv/media/media_files/2025/07/22/honey-trapped-drdl-contract-employee-shared-details-of-indian-ramy-secret-information-2025-07-22-06-52-24.jpg)
Honey -trapped drdl- contract -employee shared details of Indian ramy secret information
ఈ మధ్యకాలంలో హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రత రహస్య సమాచారాన్ని యువతులకు పింపంచి అరెస్టవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హనీట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్‌డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి మల్లికార్జున్ రెడ్డిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022లో జూన్‌లోనే ఈ కేసు నమోదైంది. దేశ రక్షణకు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. అవతలి వ్యక్తి మహిళ అనుకొని మల్లికార్జున్ రెడ్డి వలపు వలలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
పలు రాకెట్ల ఫొటోలు, వాటి రేంజ్ వివరాలు పంపించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే మల్లికార్జున్ నుంచి సమాచారం సేకరించిన వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన ISI హ్యాండ్లర్ అయి ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇటీవల బాలాపూర్ పోలీసులు దాఖలు చేసిన ఛార్చిషీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు.
Also Read: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా
ఇక వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌కు చెందిన దుక్కా మల్లికార్జున్ రెడ్డి 2020లో ఓ ప్రాజెక్టు కోసం డీఆర్‌డీఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు.2022లో ఫేస్‌బుక్ ద్వారా నటాషారావు అలియాస్ సిమ్రాన్ చోప్రాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు, మాట్లాడుకునేవారు. 6 నెలల పాటు విదేశీ ఐపీ అడ్రస్‌తో మల్లికార్జున్ తరచూ మాట్లాడటంతో నిఘా సంస్థలు దీన్ని గుర్తించాయి. చివరికి బాలాపూర్ పోలీసులు 2022 జులైలో అతడిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ డేటాను సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో రీట్రీవ్ కూడా చేయించారు. చివరికి అతడు దేశ భద్రతకు సంబంధించి రహస్య సమాచారం పంపించినట్లు తేల్చారు.